Ileana D'Cruz: నిజాయతీగా పని చేశా.. రావలసిన గుర్తింపు రాలేదు!
ABN, Publish Date - Apr 30 , 2024 | 01:42 PM
ఇలియానా... ఒకప్పుడు టాలీవుడ్లో అగ్ర కథానాయికగా వెలుగొందారు. తర్వాత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టారు. హిందీలో పలు విజయాలు అందుకున్నారు. కొన్ని నెలల క్రితం ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.
ఇలియానా(Ileana D'Cruz)... ఒకప్పుడు టాలీవుడ్లో అగ్ర కథానాయికగా వెలుగొందారు. తర్వాత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టారు. హిందీలో పలు విజయాలు అందుకున్నారు. కొన్ని నెలల క్రితం (Ileana Motherhood) ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను నటించిన ఓ బాలీవుడ్ (Bollywood)చిత్రం తర్వాత దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని వ్యాఖ్యలు చేశారు.
‘2012లో అనురాగ్ బసు (Anurag basu) దర్శకత్వంలో తెరకెక్కిన ‘బర్ఫీ’ (Barfi)చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేశా. అప్పటికే నేను దక్షిణాదిలో ఫుల్ బిజీ. బర్ఫీ కథా చాలా నచ్చింది. అలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయనిపించింది. దాన్ని వదులుకోవడం ఇష్టం లేక, అలా చేస్తే తెలివి తక్కువనం అవుతుందని భావించి ఆ సినిమా చేశా. ఊహించినట్లుగానే చక్కని ఆదరణ పొందింది. దీంతో అందరూ నేను దక్షిణాదిని వదిలేసి బాలీవుడ్‌కు మకాం మార్చానని భావించారు. ఇక ఇలియానా సౌత్ సినిమాలు చేయదని అనుకున్నారు. ఆ అపోహతోనే నాకు అవకాశం ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపలేదు. బాలీవుడ్‌కు వెళ్లాక నేను సినిమాలు ఎంపిక చేసే విధానంలో మార్పు వచ్చింది. చాలా సెలక్టివ్‌గా వ్యవహరించా. ఏ పని అయినా నిజాయితీగా చేస్తా. నా పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ, ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. నాకు రావాల్సిన గుర్తింపు రాలేదనిపిస్తుంది. దానికి కారణం కూడా నాకు తెలీదు’ అని భావోద్వేగానికి లోనయ్యారు.