Hrithik Roshan: కోలుకునే వరకూ వార్-2 కూడా వాయిదానే!
ABN, Publish Date - Feb 15 , 2024 | 10:59 AM
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. నడుముకు బెల్ట్ పెట్టుకుని క్రచెస్ సాయంతో నిలుచున్న ఫోటోను ఆయన షేర్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. నడుముకు బెల్ట్ పెట్టుకుని క్రచెస్ సాయంతో నిలుచున్న ఫోటోను ఆయన షేర్ చేశారు. గతంలో మీలో ఎంతమందికి ఈ క్రచెస్, వీల్ చైర్ అవరసమెచ్చింది? ఆ టైమ్‌లో మీ ఫీలింగ్ ఏంటి? అని పోస్ట్ చేశారు. కాలి గాయంతో కలిగిన బాధ నుంచి ప్రస్తుతం కోలుకుంటున్నానని చెప్పారు. ఈ మేరకు హృతిక్ ఇన్ స్టాలో సుధీర్ఘమైన పోస్ట్ చేశారు. చిన్నతనంలో తన తాతయ్య స్ట్రెంగ్త్ వాల్యూ గురించి చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నారు. ప్రయాణ సమయంలో ఫ్లైట్ ఎక్కడానికి వీల్ ఛైర్లో కూర్చోమంటే అయన ఎందుకు తిరస్కరించేవారో నాకు ఇప్పుడు అర్థమైంది. వీల్‌చైర్ సాయం ఫ్లైట్ ఎక్కితే తనని నిస్సాహయుడిగా పరిగణిస్తారనే భావన ఆయనలో ఉండేది. ఆయన ఎప్పుడూ స్ట్రాంగ్ అని నిరూపించుకోవాలనుకునే వారు. అలాగే ఉన్నారు కూడా’’ అని చెప్పారు. ఇలాంటి ఫీలింగ్ నుంచి బయటకు రావాలి. నా బాడీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవాలని ఇటీవల కండరాలు బిగపట్టి లేచి నిల్చున్నాను’’ అని ఇన్‌స్టా లో రాసుకొచ్చారు.
అయితే గాయానికి కారణం ఏంటనేది చెప్పలేదు. ప్రస్తుతం ఆయన వార్-2 చిత్రంలో నటిస్తున్నారు. తన గత చిత్రం ఫైటర్ ఇటీవల విడుదలైంది. ఆ సినిమా షూటింగ్లో ఏదైనా ప్రమాదం వల్ల కాలికి గాయం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబినేషన్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రం వార్-2 షూటింగ్ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వార్ -2 కోసం ఇప్పటికే జూ.ఎన్టీఆర్ డేట్స్ కూడా ఇచ్చేశారు. త్వరలో షూటింగ్ అనుకుంటున్న సమయంలో హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది.