మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indresh Malik: హీరోయిన్ సోనాక్షి తల్లి స‌మ‌క్షంలోనే.. ఆ స‌న్నివేశాలు తీశారు

ABN, Publish Date - May 06 , 2024 | 10:56 PM

ఇటీవ‌ల ఓటీటీలోకి వ‌చ్చి మంచి వ్యూవ‌ర్‌షిప్ ద‌క్కించుకున్న వెబ్ సిరీస్ ‘హీరామండి’.అయితే ఇందులో సోనాక్షి సిన్హా తో క‌లిసి ఇంటిమేట్ స‌న్నివేశాల‌లో న‌టించిన ఇంద్రేష్‌ మాలిక్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు వెళ్ల‌డించాడు.

sonakshi

ఇటీవ‌ల ఓటీటీలోకి వ‌చ్చి మంచి వ్యూవ‌ర్‌షిప్ ద‌క్కించుకున్న వెబ్ సిరీస్ ‘హీరామండి’(Heeramandi). దేశ‌మంతా గ‌ర్వించే ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ (Sanjay Leela Bhansali) ఫ‌స్ట్ టైం రూపొందించిన సిరీస్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. నెట్‌ఫ్లిక్స్ లో మే1 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సూప‌ర్ రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. మ‌నీషా కోయిరాలా (Manisha Koirala), అదితిరావ్ హైద‌రీ (Aditi Rao Hydari), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha ), ఫ‌ర్ధీన్ ఖాన్ (Fardeen Khan) వంటి స్టార్లు న‌టించారు.

స్వాతంత్య్రానికి పూర్వం 1920 నుంచి 1940 ల మ‌ధ్య అప్ప‌టి భార‌త‌దేశంలో భాగ‌మైన ఇప్ప‌టి పాకిస్తాన్లోని లాహోర్‌లో రెడ్‌లైట్‌ ప్రాంతంగా పేరున్న‌ హీరామండిలోని వేశ్య‌ల జీవితాల నేప‌థ్యంలో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. అయితే ఇందులో సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)తో క‌లిసి ఇంటిమేట్ స‌న్నివేశాల‌లో న‌టించిన ఇంద్రేష్‌ మాలిక్ (Indresh Malik) ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు వెళ్ల‌డించాడు.


ఇంద్రేష్‌ మాలిక్ (Indresh Malik) మట్లాడుతూ.. సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)తో ఇంటిమేట్ స‌న్నివేశాల‌లో న‌టించే స‌మ‌యంలో బాగా అసౌక‌ర్యానికి గుర‌య్యాన‌ని, చాలా సిగ్గు వేసేద‌ని అన్నారు. ఆ సీన్ల తీసేట‌ప్పుడు సోనాక్షి అమ్మ‌గారు అక్క‌డే ఉండేవార‌ని ఈ విష‌యం తెలుసుకున్న సోనాక్షి నాకు ధైర్యం చెప్పి ఫ్రీగా న‌టించండ‌ని, ఇవి సిరీస్‌కు చాలా కీల‌క‌మైన స‌న్నివేశాల‌ని త‌న త‌ల్లి ముందే త‌న‌కు చెప్పి నాకు చాలా స‌పోర్ట్ చేసింద‌ని అన్నారు. అంతా అనుభ‌వ‌జ్ఞులైన టీమ్ కావ‌డంతో ఎక్కువ టేకులు లేకుండానే షూటింగ్ పూర్తి చేశామ‌ని అన్నారు. వెబ్ సిరీస్ త‌ర్వాత నా న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయ‌న్నారు.

Updated Date - May 06 , 2024 | 10:56 PM