Salman Khan: సల్మాన్ ఖాన్‌కి బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్
ABN, Publish Date - Oct 24 , 2024 | 11:52 AM
ఇటీవల రూ. 5 కోట్లు ఇస్తే సల్మాన్‌కి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అలర్ట్ అయిన ముంబై పోలీసులు సల్మాన్ ఇంటి వద్ద భద్రతా మరింత పటిష్టం చేశారు. ఈ మెసేజ్ మూలాలను టెక్ టీమ్‌తో కలిసి తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఎట్టకేలకు మెసేజ్ మూలలను కనుగొన్న పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంతకీ ఏమైందంటే..
సల్మాన్ ఆప్త మిత్రుడు, ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యానంతరం సల్మాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇటీవల రూ. 5 కోట్లు ఇస్తే సల్మాన్‌కి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అలర్ట్ అయిన ముంబై పోలీసులు సల్మాన్ ఇంటి వద్ద భద్రతా మరింత పటిష్టం చేశారు. ఈ మెసేజ్ మూలాలను టెక్ టీమ్‌తో కలిసి తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఎట్టకేలకు మెసేజ్ మూలలను కనుగొన్న పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంతకీ ఏమైందంటే..
బాబా సిద్ధిఖీ హత్యానంతరం బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రూ. 5 కోట్లు ఇస్తే వదిలేస్తాం అని వచ్చిన మెసేజ్ ని ముంబై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ జరిపిన పోలీసులు.. మెసేజ్ మూలాలను ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో కనుగొన్నారు. జంషెడ్పూర్ లో కూరగాయల వ్యాపారం చేసే 24 ఏళ్ల యువకుడు ఈ మెసేజ్ చేసినట్లు నిర్దారించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఆ యువకుడు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
1998లో సల్మాన్ ఖాన్ ‘హమ్ సాథ్ సాథ్ హై’ మూవీ షూటింగ్ సందర్భంగా ఓ కృష్ణ జింకను వేటాడి చంపాడన్న ఆరోపణలు ఉన్నాయి. చట్టపరంగా ఈ కేసులో సల్మాన్ కొద్ది రోజుల శిక్ష అనంతరం.. అతనికి ఫేవర్‌గా తీర్పు వచ్చింది. కానీ జింక హత్య కేసును మనసులో పెట్టుకున్న లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికీ సల్మాన్‌ను చంపాలని చూస్తున్నాడు. సల్మాన్‌కు సన్నిహితుడైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. దీంతో ఈ కేసు ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సల్మాన్ పైనా ఇప్పటికే హత్యాయత్నం జరిగింది. సల్మాన్ ప్రస్తుతం ‘సికిందర్’ సినిమాలో నటిస్తున్నారు.