Grammy Awards 2024: శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్ విజయకేతనం ఎగురవేశారు!
ABN, Publish Date - Feb 05 , 2024 | 12:16 PM
సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 66వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు తమ పాటలతో సందడి చేశారు.
సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 66వ గ్రామీ అవార్డుల (Grammy Awards 2024) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు తమ పాటలతో సందడి చేశారు. అంతర్జాతీయ వేదికపై జరిగిన ఈ వేడుకలో భారతీయ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్ (Shankar Mahadevan), జాకిర్ హుస్సేన్ విజయకేతనం ఎగురవేశారు. 'శక్తి' (Sakthi) పేరుతో ఈ టీమ్ కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ (This moment) ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. జాన్ మెక్‌లాఫ్లిన్ (గిటార్), జాకిర్ హుస్సేన్ (తబలా), శంకర్ మహదేవన్(సింగర్), గణేశ్ రాజగోపాలన్ (వయోలిన్) ఇలా ప్రతిభ గల ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్ పేరుతో ఈ ఆల్బమ్ కంపోజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పోటీని ఎదుర్కొని ‘శక్తి’ టీమ్ విజేతగా నిలిచింది. వీరికి అంతర్జాతీయ స్థ్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. అలాగే మిడ్ నైట్స్ ఆల్బమ్‌కు గానూ టేలర్ స్విఫ్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఈయర్ పురస్కారం అందుకున్నారు.
శంకర్ మహదేవన్ మాట్లాడుతూ "ప్రతి విషయంలో నాకు ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా’’ అని తెలిపారు.
గ్రామీ - 2024 విజేతలు..
ఉత్తమ ర్యాప్ ఆల్బమ్ - మైఖేల్ (కిల్లర్ మైక్)
ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన - టైలా (వాటర్)
ఉత్తమ రాక్ సాంగ్, ప్రదర్శన - బాయ్‌జెనియస్ (నాట్ స్ట్రాంగ్ ఎనఫ్)
ఉత్తమ రాక్ ఆల్బమ్ - పారామోర్ (దిస్ ఇజ్ వై)
ఉత్తమ కామెడీ ఆల్బమ్ - డేవ్ చాపెల్ ( వాట్స్ ఇన్ ఏ నేమ్)
ఉత్తమ కంట్రీ సాంగ్, సోలో ప్రదర్శన - క్రిస్ స్టేప్లెటన్ (వైట్ హార్స్)
మ్యాజిక్ వీడియో - జోనథన్ క్లైడ్ ఎమ్ కూపర్ (ఐయామ్ ఓన్లీ స్లీపింగ్)
గ్లోబల్ మ్యూజిక్ ప్రదర్శన - జాకిర్ హుస్సేన్, బెలా ఫెక్ (పష్టో)
గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ - శక్తి (దిస్ మూమెంట్)
ఉత్తమ క్లాసికల్ సోలో వోకల్ ఆల్బమ్ - జూలియా బూల్లక్, సోలోయిస్ట్ (వాకింగ్ ఇన్ ద డార్క్)