Gauri Khan: తన ఇంట్లో షారుఖ్‌ పేరుని మార్చి చెప్పిన గౌరీ ఖాన్.. ఇంత మ్యాటర్ జరిగిందా..

ABN, Publish Date - Oct 08 , 2024 | 09:44 PM

బాలీవుడ్ కపుల్ గౌరీ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల ప్రేమ పెళ్లికి సంబంధించి ఇప్పుడు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. గౌరీ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆమె బర్త్‌డే స్పెషల్‌గా ఆ విషయాలన్నీ వైరల్ అవుతున్నాయి.

Gauri Khan and SRK

బాలీవుడ్ కపుల్ గౌరీ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల ప్రేమ పెళ్లికి సంబంధించి ఇప్పుడు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. గౌరీ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆమె వ్యాఖ్యలతో గౌరీ, షారుఖ్‌ల పెళ్లి విషయంలో ఇంత తతంగం జరిగిందా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. విషయంలోకి వస్తే.. గౌరీ ఖాన్ వయసు 21, షారుఖ్ ఖాన్ వయసు 26 ఉన్నప్పుడు వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 1991లో వీరిద్దరి వివాహం జరిగింది. ఇద్దరి మతాలు వేరైనప్పటికీ వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లి బాలీవుడ్‌లో ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. అక్టోబర్ 8 గౌరీ ఖాన్ పుట్టినరోజు. దీంతో వారి ప్రేమ, పెళ్లికి సంబంధించి మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read- Rahul Ravindran: వావ్.. అనిపిస్తున్న రాహుల్ రవీంద్రన్ సెలెక్షన్!


షారుఖ్ ఖాన్‌కి 18 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి గౌరీని ప్రేమిస్తుండేవారట. కానీ ఆమె షారుఖ్ ప్రేమను అంగీకరించడానికి చాలా కాలం పట్టిందని.. ప్రేమ ఓకే అయిన తర్వాత పెళ్లి ఎలా చేసుకోవాలనే దానిపై వారు చాలా ఆలోచన చేసినట్లుగా గౌరీ ఖాన్ తెలిపారు. ‘‘మా ఇద్దరి మతాలు వేరు. దీంతో ఇంట్లో వాళ్లు మా ప్రేమను ఒప్పుకోలేదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత షారుఖ్‌ని మా వాళ్లకి అభినవ్‌గా పరిచయం చేశాను. అభినవ్ అనగానే హిందువు అనుకుంటారని అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది మాది చాలా సిల్లీ మరియు చైల్డిష్ ఆలోచన అని. పెళ్లి తర్వాత నేను మతం మార్చుకుంటానని మా వాళ్లంతా అనుకున్నారు కానీ.. నేను మతం మార్చుకోలేదు. నా మతం మార్చుకోవాలని నాపై షారుఖ్ ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదు’’ అని గౌరీ ఖాన్ తెలిపింది.


ఒకసారి గౌరీ కుటుంబ సభ్యుల్ని షారుఖ్ ఎలా ఆటపట్టించాడో తెలిపిన విషయం కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘గౌరీ వాళ్లది సాంప్రదాయ కుటుంబం. ఒకసారి వారి కుటుంబం అంతా ఒక చోట కూర్చుని ఉన్నారు. నేను ముస్లిం అని, నా భార్య మతం, పేరు మార్చుకుంటుందా? అని చర్చించుకుంటున్నారు. అప్పుడు నేను, ‘గౌరీ, బుర్ఖా వేసుకో, నమాజ్ చదువుదాం’ అని సరదాగా అన్నాను. అంతే అప్పటికే తన మతం మార్చాననుకుని కుటుంబం అంతా మా వైపు చూసింది. ‘ఇక నుంచి నిత్యం బుర్ఖా ధరిస్తుంటుంది, ఆమె పేరు అయేషా’ అని వాళ్లను సరదాగా ఆటపట్టించాను..’’ అని షారుఖ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

షారుఖ్, గౌరీ ఖాన్‌లకు ముగ్గురు పిల్లలు. ఆర్యన్, సుహానా మరియు అబ్రమ్. మరి వారి వేరు వేరు మతాల కారణంగా ఇంట్లో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా వీరిద్దరూ వేరు వేరు ఇంటర్వ్యూలలో తెలిపారు. గౌరీ మాట్లాడుతూ.. ‘‘మా మధ్య మంచి అవగాహన ఉంది. నేను షారుఖ్ మతాన్ని గౌరవిస్తాను. అలా అని నేను ఆ మతంలోకి మారతాను అని కాదు. ఎవరికి వాళ్లకి ఒక సొంత విశ్వాసం ఉండాలని, పరస్పర గౌరవం ఉండాలని నేను మొదటి నుంచి నమ్ముతూ వచ్చాను. షారుఖ్ నా మతాన్ని ఎప్పటికీ అగౌరపరచడు. కానీ మా అమ్మ మాత్రం ఇప్పటికీ గందరగోళానికి గురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆర్యన్ ‘నేను ముస్లింని’ అని అన్నప్పుడు అమ్మ ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటుంది. ఇక మా ఇంట్లో పండగల సమయంలో నేను దీపావళికి పూజకు సంబంధించిన బాధ్యతలన్నీ చూసుకుంటాను. వారంతా నన్ను అనుసరిస్తారు. ఈద్‌కి షారుక్ బాధ్యత తీసుకుంటే మేమంతా అనుసరిస్తాము. మా పిల్లలు కూడా రెండు సాంప్రదాయాలను ఫాలో అవుతారు. దీపావళి మరియు ఈద్‌లను వారు ఎక్కువగా ఇష్టపడతారు..’’ అని తెలిపింది.


షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన లీడ్ హీరో తన స్టామినాని కంటిన్యూ చేస్తూ.. వరుస హిట్స్‌తో దూసుకెళుతున్నారు. గౌరీ ఖాన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నిర్మాతగా, ఫ్యాషన్ డిజైనర్‌గా మరియు సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్‌గా కొనసాగుతున్నారు.

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 08 , 2024 | 09:44 PM