40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fighter: హృతిక్ రోషన్ కెరీర్‌లో ఆ ఘనత సాధించిన 14వ చిత్రంగా ‘ఫైటర్’

ABN, Publish Date - Jan 28 , 2024 | 05:52 AM

రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన హృతిక్ రోషన్ ‘ఫైటర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాతో హృతిక్ రోషన్ 14వ సారి 100 కోట్ల క్లబ్‌లో చేరారు. ఈ చిత్రం విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ఈ ఘనత సాధించింది. ఈ చిత్రంతో హృతిక్‌కి మరో రికార్డ్ కూడా దక్కింది. ‘అగ్నిపథ్, కాబిల్’ తర్వాత రిపబ్లిక్ డే కి విడుదలై 100 కోట్ల గ్రాస్ సాధించిన హ్యాట్రిక్ మూవీగా ‘ఫైటర్’ నిలిచింది.

Hrithik Roshan in Fighter

రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన హృతిక్ రోషన్ ‘ఫైటర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాతో హృతిక్ రోషన్ 14వ సారి 100 కోట్ల క్లబ్‌లో చేరారు. ఈ చిత్రం విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ఈ ఘనత సాధించింది. ఈ చిత్రంతో హృతిక్‌కి మరో రికార్డ్ కూడా దక్కింది. ‘అగ్నిపథ్, కాబిల్’ తర్వాత రిపబ్లిక్ డే కి విడుదలై 100 కోట్ల గ్రాస్ సాధించిన హ్యాట్రిక్ మూవీగా ‘ఫైటర్’ నిలిచింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. హృతిక్ రోషన్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.

ఓవర్సీస్‌లో సైతం ఫైటర్ మూవీ అద్భుతంగా రాణిస్తోంది. ‘వార్’ తర్వాత సింగిల్ డే లో 40 కోట్లు సాధించిన హృతిక్ రెండవ చిత్రంగా ఫైటర్ రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాలో సైతం హృతిక్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాస్ రాబట్టిన చిత్రంగా ‘ఫైటర్’ దూసుకుపోతోంది. ఈ సినిమా సాధించిన రికార్డులు ఇంకా చాలానే ఉన్నాయి. హృతిక్ రోషన్ కెరీర్‌లో ఫైటర్ చిత్రం వరుసగా 100 కోట్లు సాధించిన 10వ చిత్రంగా నిలిచింది. ఈ 100 కోట్ల పరంపర 2001లో ‘కభీ ఖుషి కభీ గమ్’ చిత్రంతో ప్రారంభమైంది. ఈ చిత్రంతో పాటు ‘క్రిష్, ధూమ్ 2, జోధా అక్బర్’ చిత్రాలు కూడా అప్పట్లో 100 కోట్లు సాధించాయి. 


హృతిక్ రోషన్ కెరీర్‌లో 100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాల జాబితా ఇదే.. 

1. కభీ ఖుషి కభీ గమ్

2. క్రిష్ 

3. ధూమ్2

4. జోధా అక్బర్ 

5. జిందగీ న మిలేగి దోబారా 

6. అగ్నిపథ్ 

7. క్రిష్ 3

8. బ్యాంగ్ బ్యాంగ్ 

9. మొహంజదారో 

10. కాబిల్ 

11. సూపర్ 30 

12. వార్ 

13. విక్రమ్ వేద 

14. ఫైటర్ 

ప్రస్తుతం ఫైటర్ చిత్రానికి నమోదవుతున్న వసూళ్లు చూస్తుంటే.. 2024లో హిందీ నుంచి తొలి పెద్ద విజయంగా రికార్డు క్రియేట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Updated Date - Jan 28 , 2024 | 05:53 AM