మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Poonam Pandey: ఫేక్ డెత్‌.. పూన‌మ్ పాండేపై కేసు

ABN, Publish Date - Feb 04 , 2024 | 08:14 PM

రెండు రోజుల క్రితం ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి పూన‌మ్ పాండే క్యాన్స‌ర్‌తో చ‌నిపోయిన‌ట్లు వ‌చ్చిన వార్త‌లు షాక్‌కు గురి చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదైంది.

poonam pondey

రెండు రోజుల క్రితం ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి, కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ పూన‌మ్ పాండే(Poonam Pandey) క్యాన్స‌ర్‌తో చ‌నిపోయిన‌ట్లు వ‌చ్చిన వార్త‌లు దేశాన్ని షాక్‌కు గురి చేసిన విష‌యం తెలిసిందే. తెల్లారి నేను చ‌నిపోలేదు బ‌తికే ఉన్నా అంటూ పోస్టు పెట్ట‌డంతో అంతా బిత్త‌ర‌పోయారు. ఈ విష‌య‌మై సోష‌ల్ మీడియా మొత్తం ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా ఆమెను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదైంది.

రెండు రోజుల క్రితం శుక్ర‌వారం పూన‌మ్ పాండే మ‌ర‌ణించిన‌ట్టుగా ఆమె మేనేజర్ పూన‌మ్‌ అధికారిక‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. దీంతో పూన‌మ్ సర్వైకల్‌ క్యాన్సర్ (Cervical Cancer)తో మృతి చెందిన‌ట్లు క్ష‌ణాల్లో న్యూస్ ఛాన‌ళ్లో, సోష‌ల్ మీడియాల్లో వార్త‌లు బాగా స్ప్రెడ్ అవ‌డంతో అంత‌టా చర్చనీయాంశం అయింది. కొంత‌మంది ఆమె మరణవార్తను తోసిపుచ్చగా, ఎప్ప‌టి మాదిరిగానే అది కేవలం పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమేనంటూ కొట్టిపడేశారు. ఇది జ‌రిగిన 24 గంట‌ల్లోనే పూన‌మ్ పాండే (Poonam Pandey) నేను బ‌తికే ఉన్నాన‌ని, గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ (Cervical Cancer) మీద అవ‌గాహ‌న కోస‌మే ఇలా చేశానంటూ ఓ వీడియో విడుద‌ల చేసింది.


ఈ వీడియోలో ‘నేను మీ అందరితో ఓ ముఖ్యమైన వియాన్ని పంచుకోవాలనుకుంటున్నా.. నేను సజీవంగానే ఉన్నా నాకు ఎలాంటి సర్వైకల్‌ క్యాన్సర్‌ లేదని, ప్రస్తుతం చాలా మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారని, దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదని, అయితే ఇతర క్యాన్సర్లలా కాకుండా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చని, ప్రతి మహిళ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం ద్వారా క్యాన్సర్ తో వచ్చే ప్రమాదాన్ని అంతం చేయడానికి కలిసి ప్రయత్నం చేద్దామని’ పిలుపునిస్తూ వీడియో రిలీజ్ చేసింది.

అయితే ఈ ఘ‌ట‌న విష‌యంలో పూన‌మ్ (Poonam Pandey)పై నెటిజ‌న్స్ తీవ్ర స్థాయిలో మండి ప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతు ట్రోల్ చేస్తున్నారు. గ‌తంలోనూ ప‌ల‌మార్లు పూన‌మ్ పాండే ఇలానే ప‌బ్లిసిటీ కోసం హాడావుడి చేసిన ఘ‌ట‌న‌లు చాలా ఉండ‌డంతో ఇంత సిరియ‌స్ అంశాన్ని ఇలా జోక్ చేస్తారా, ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటారా అస‌లు నువ్వు మ‌నిషివేనా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ముంబైకి చెందిన అడ్వ‌కేట్‌ అలీ కాషిఫ్ ఫిర్యాధుతో శనివారం ముంబైలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అలాగే ఈ వార్త‌ను ప్రచారం చేసినందుకు ఆమె మేనేజర్‌ నికితా శర్మపై సైతం కేసు నమోదైంది.

ఇదిలాఉండ‌గా పూన‌మ్ చేసిన ఈ చ‌ర్య‌తో ఆమెపై ఎంత వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌దో అదే స్థాయిలో సెలబబ్రిటీల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ది. ఇప్ప‌టికే ప‌లువురు న‌టులు పూన‌మ్‌కు స‌పోర్టుగా నిల‌వ‌గా తాజాగా ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అండ‌గా నిలిచారు. గర్భాశయ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పూనం (Poonam Pandey) ఎంచుకున్న పద్ధతి చాలా మందికి అర్థం కాద‌ని, అమె ఎంచుకున్న మార్గం త‌ప్పైనా.. చెప్పాల‌నుకున్నా విష‌యం చాలా ప్రాముఖ్య‌త ఉన్న‌ద‌ని కొనియాడారు. ఆమె చేసిన ఈ చిన్న ప్ర‌య‌త్నం వ‌ళ్లే నేడు ఈ గర్భాశయ కేన్సర్‌(Cervical Cancer)పై విస్తృతంగా చర్చ జరుగుతుంద‌ని, ఈ అంశం ఇంకా చాలా మందికి తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పూన‌మ్‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తెలిపారు.

Updated Date - Feb 04 , 2024 | 08:21 PM