Biggboss 18: గాడిదను పంపేశారు.. ఇష్యూ క్లోజ్‌..

ABN, Publish Date - Oct 14 , 2024 | 01:16 PM

హిందీలో కూడా బిగ్‌బాస్‌ (Biggboss) రియాలిటీ షో ఎంతో ఆదరణ పొందిన షోగా పేరొందింది. ప్రస్తుతం 18వ సీజన్‌ నడుస్తోంది

హిందీలో కూడా బిగ్‌బాస్‌ (Biggboss) రియాలిటీ షో ఎంతో ఆదరణ పొందిన షోగా పేరొందింది. ప్రస్తుతం 18వ సీజన్‌ నడుస్తోంది (Biggboss season 18). తాజాగా ఈ షో వార్తల్లో నిలిచింది. కంటెస్టెంట్‌గా గాడిదను తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. గాడిదను ( Donkey Gadhraj) తొలగించాలని కోరుతూ ‘పెటా ఇండియా’ బిగ్‌బాస్‌ యాజమాన్యానికి లేఖ రాసింది. దీనిపై తాజాగా యాజమాన్యం స్పందించింది. బిగ్‌బాస్‌ టీమ్‌ గాడిదను విడుదల చేసినట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది. బిగ్‌బాస్‌ను ఆదరిస్తున్నందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు అని సంబంధిత సిబ్బంది చెప్పారు. టీమ్‌ వర్క్‌ వల్లే ఈ షో ఇంతగా విజయవంతం అయిందని పేర్కొన్నారు.

అక్టోబర్‌ 6న హిందీలో బిగ్‌బాస్‌ 18వ సీజన్‌ మొదలైంది. ఇందులో కంటెస్టెంట్‌గా గాడిదను హౌస్‌లోకి పంపారు. దీంతో పెటా ఇండియా బిగ్‌బాస్‌ టీమ్‌తో పాటు సల్మాన్‌కు కూడా లేఖ రాసింది. ‘‘మీ పలుకుబడి ఉపయోగించి రియాలిటీ షో నిర్మాతలను ఒప్పించండి. గాడిదను సెట్స్‌ నుంచి తొలగించి.. మాకు అప్పగించండి’’ అని సల్మాన్‌కు పెటా ఇండియా విజ్ఞప్తి చేసింది. జంతువులను వినోదం కోసం ఇలా ఉపయోగించొద్దని, ఇలాంటి చర్యలు మానుకోవాలని తెలిపింది. బిగ్‌బాస్‌ ేస్టజ్‌పై ఆ గాడిదను సల్మాన్‌.. గద్‌రాజ్‌ అని పిలుస్తూ.. దాంతో మాట్లాడటం పైన కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ నువ్వు గెలిస్తే.. నిన్ను ఎలా ఎత్తుకోవాలి. నీ చెవులు పట్టుకొని నిన్ను ఎత్తుకుంటాను’ అని సల్మాన్‌ గాడిదతో సంభాషించారు.  బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి గాడిదను పంపేయడంతో వివాదం సద్దుమణిగింది. 

Updated Date - Oct 14 , 2024 | 01:16 PM