Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!
ABN, Publish Date - Apr 10 , 2024 | 04:23 PM
రీసెంట్‌గా జరిగిన ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ‘దేవర’ను ఉద్దేశించి ‘దేవర’ నామ సంవత్సరం మొదలైందని అన్నారు. అన్నట్లుగానే.. నిజంగానే ఈ సంవత్సరం ‘దేవర’ నామ సంవత్సరంగా మారబోతుంది. ‘దేవర’ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో మరోసారి ‘దేవర’ చిత్రం వార్తలలో హైలెట్ అవుతోంది.
రీసెంట్‌గా జరిగిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram).. ‘దేవర’ (Devara)ను ఉద్దేశించి ‘దేవర’ నామ సంవత్సరం మొదలైందని అన్నారు. అన్నట్లుగానే.. నిజంగానే ఈ సంవత్సరం ‘దేవర’ నామ సంవత్సరంగా మారబోతుంది. ఆయన అలా అన్నారో లేదో.. ఇప్పుడు ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చేసింది. ‘దేవర’ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ని (North India Theatrical Distribution Rights) బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions) సొంతం చేసుకుంది. దీంతో మరోసారి ‘దేవర’ చిత్రం వార్తలలో హైలెట్ అవుతోంది.
*Trivikram Srinivas: ‘దేవర’ నామ సంవత్సరం.. 100 పక్కన ఇంకో సున్నాతో మొదలవ్వాలి
ధర్మ ప్రొడక్షన్స్.. విషయానికి వస్తే.. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రాన్ని నార్త్‌లో విడుదల చేసింది ఈ సంస్థే. కరణ్ జోహార్ (Karan Johar)కి చెందిన ఈ నిర్మాణ సంస్థ.. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్‌ని ఒక్కసారిగా ‘బాహుబలి’తో సొంతం చేసుకుంది. ఇప్పుడీ సంస్థ.. ‘దేవర’ రైట్స్ (Devara Rights) కోసం క్యూ కట్టి మరీ సొంతం చేసుకుందంటే.. ఇక నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్స్, ప్రమోషన్స్ అన్నీ ఈ సంస్థ పక్కాగా ప్లాన్ చేస్తుంది. ‘బాహుబలి’ సినిమాను కరణ్ జోహార్ అండ్ టీమ్ ఎలా పబ్లిక్‌లోకి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
అయితే ఈ సంస్థతో చిన్న ప్రాబ్లమ్ కూడా ఉంది. అది ఏంటంటే.. ఈ సంస్థలో విడుదలయ్యే సినిమాలన్నింటికీ ఈ మధ్య ఓ ట్యాగ్ వైరల్ అవుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ మృతి తర్వాత ఈ సంస్థ నుండి వచ్చే ప్రతి సినిమా ‘బ్యాన్’, ‘బాయ్ కాట్’ ట్యాగ్స్‌ని ఫేస్ చేస్తున్నాయి. ఈ సమస్యని కనుక జయిస్తే.. ‘దేవర’కు ఇక నార్త్ బెల్ట్‌లో తిరుగులేనట్లే. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌తో కలిసి ఈ సంస్థే నిర్మించింది. కరణ్ జోహార్‌పై ఉన్న వ్యతిరేకత ఏంటనేది ‘లైగర్’ (Liger) సినిమా విషయంలో అందరికీ తెలిసింది. కాగా, ఏఏ ఫిల్మ్స్ ఇండియాతో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ‘దేవర’ సినిమాను హిందీ బెల్ట్‌లో విడుదల చేయనుంది.
మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ (Man of the Masses Young Tiger NTR), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), శృతి మరాఠే (Shruti Marathe) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..
****************************
*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!
***********************