మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chitrangada Singh: ఆమె వయసు 48, కానీ ఆమెని చూస్తే అబ్బా...

ABN, Publish Date - May 18 , 2024 | 04:40 PM

వయసు పెరుగుతున్నకొద్దీ కొందరి అందము తరగదు, అలంటి వారిలో 50కి పైగా వున్న మలైకా అరోరా ఖాన్ లాంటి నటీమణి ఇప్పటికీ అందంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఉంటే, 48 ఏళ్ల చిత్రాంగద కూడా తరిగిపోని అందంతో యువనటీమణులకి నేనేమీ తీసిపోను అన్నట్టుగా కనిపిస్తున్నారు

Chitrangada Singh

చిత్రాంగద సింగ్ బాలీవుడ్ నటి, మోడల్. ఆగస్టు 30, 1976 సంవత్సరంలో జన్మించింది. చిత్రాంగద తండ్రి మిలిటరీలో పనిచెయ్యడం వలన, అతను ఉద్యోగరీత్యా పలు పట్టణాలకి బదిలీలు అవటం వలన చిత్రాంగద విద్యాభ్యాసం కూడా రాజస్థాన్ లో పుట్టి అక్కడ మొదలై, తరువాత పలు పట్టణాల్లో చదివి, చివరికి ఢిల్లీలో హోమ్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.


గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత చిత్రాంగద మోడలింగ్ లో తన ప్రతిభని ముందుగా చాటుకుంది. పలు కంపెనీల ప్రచార వీడియోలో చిత్రాంగద పాల్గొంది. తరువాత ఒక మ్యూజిక్ వీడియోలో ఆమె భాగం అవటం, ఆ వీడియో వైరల్ అవటం, ఆలా ఆమెని అందరి దృష్టి ఆకర్షించారు, బాలీవుడ్ చిత్ర దర్శకులు కూడా అప్పుడే ఆమెని చూశారు.


చిత్రాంగద మొదటి సినిమా 'హజారోన్ ఖ్వైషీన్ ఐసి' అనే ద్వారా చిత్రపరిశ్రమలోకి ఆరంగేట్రం చేశారు. దీనికి సుధీర్ మిశ్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2005లో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె చేసిన గీత రావు పాత్రకిగాను విశేషమైన స్పందన లభించింది. ఆమె నటనని ఎంతో ప్రశంసించారు. తరువాత అదే సంవత్సరంలో 'కల్: ఎస్టర్డే అండ్ టుమారో' అనే సినిమాలో కూడా నటించింది చిత్రాంగద.


ఎందుకో ఆ సినిమా తరువాత చిత్రాంగద ఒక మూడేళ్ళ పాటు బ్రేక్ తీసుకున్నారు. 2008లో 'సారీ భాయ్' అనే సినిమాతో మళ్ళీ పరిశ్రమలో అడుగుపెట్టారు. సంజయ్ సూరి కథానాయకుడు, ఓనిర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా తరువాత ఇంకో సినిమా కూడా చిత్రాంగద చేశారు, కానీ అంతగా ఫలితం రాలేదు.


2011లో 'దేశి బాయ్స్' అనే సినిమాలో అక్షయ కుమార్ పక్కన కథానాయకురాలిగా నటించింది. ఇది ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు రోహిత్ ధావన్ దర్శకుడిగా చేసిన మొదటి సినిమా. ఇందులో అక్షయ్ తో పాటు, జాన్ అబ్రహం, దీపికా పదుకోన్, సంజయ్ దత్ కూడా నటించారు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ సినిమాగా నడిచింది. ఈ సినిమా తరువాత చిత్రాంగద చాలా తక్కువ సినిమాలు చేశారు, కానీ ఎక్కువగా స్పెషల్ పాటల్లో కనిపించారు.


చిత్రాంగద మోడలింగ్, సినిమాలే కాకుండా వెబ్ సిరీస్, టీవిలో కూడా నటించారు. 'మోడరన్ లవ్ ముంబై' అనే వెబ్ సిరీస్ లో చిత్రాంగద నటించారు. చిత్రాంగద గోల్ఫ్ ఆటగాడు జ్యోతి రణధవతో ఒక ఐదేళ్లు ప్రేమలో పడిన తరువాత అతన్ని 2001 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు వున్నాడు. అయితే వీరిద్దరూ 2013లో విడిపోవాలని అనుకుని, 2015లో అధికారికంగా విడాకులు పుచ్చుకున్నారు. కుమారుడు మాత్రం చిత్రాంగదతో ఉంటున్నాడు.

Updated Date - May 18 , 2024 | 04:40 PM