Khushi Kapoor: బాబోయ్ ఖుషి ఇన్ని ఫాలో అవుతాదా?
ABN, Publish Date - Mar 10 , 2024 | 11:22 AM
శ్రీదేవి, బోనీకపూర్ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికే వరుస చిత్రాలతో బిజీ అయిపోయింది. గత ఏడాది చివర్లో రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా తెర మీదకు వచ్చింది. జోయా అక్తర్ దర్శకత్వంలో విడుదలైన ‘ది ఆర్చీస్’లో షారూక్ కూతురు సుహానాతో కలిసి నటించింది. ఇద్దరికీ అదే తొలి చిత్రం
కరీనా... కత్రినా రోజులు పోయాయి.
అనుష్కా... దీపికను దాటి, సారా... సుహానా తరం మెరుపులు మొదలయ్యాయి.
అలా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మరో నటి...
శ్రీదేవి వారసురాలు... ఖుషీ కపూర్.
చూడచక్కని ఫిజిక్... ఇన్‌స్టా రీల్స్‌తో... సినిమాల్లోకి రాకముందే కుర్రకారు మనసు దోచుకుంది.
శ్రీదేవి, బోనీకపూర్ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికే వరుస చిత్రాలతో బిజీ అయిపోయింది. గత ఏడాది చివర్లో రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా తెర మీదకు వచ్చింది. జోయా అక్తర్ దర్శకత్వంలో విడుదలైన ‘ది ఆర్చీస్’లో షారూక్ కూతురు సుహానాతో కలిసి నటించింది. ఇద్దరికీ అదే తొలి చిత్రం. ప్రస్తుతం ఒక హిందీ సినిమా చేస్తోంది ఖుషీ. బోనీ కపూర్, శ్రీదేవి, అనిల్ కపూర్, సంజయ్ కపూర్, అర్జున్ కపూర్... ఆమెకున్న సినీ నేపథ్యానికి భారీ బడ్జెట్ చిత్రాలతో కెరీర్ మొదలు పెట్టవచ్చు. కానీ నటనకు అవకాశం గల పాత్రలైతే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నది ఖుషీ ఆలోచన. అందుకే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోవడంలేదు.
ముంబయిలోని ‘ఎకోల్ మాండియల్ వరల్డ్ స్కూల్’లో చదివిన ఖుషీ... వేరే రంగంలో కెరీర్‌ను ఎప్పుడూ ఊహించుకోలేదు. కుటుంబమంతా పరిశ్రమకు చెందినవారే కావడంతో... ఆమె అడుగులు కూడా అటువైపే పడ్డాయి. ఆ దారిలోనే అమెరికా వెళ్లి ‘న్యూయార్క్ ఫిలిమ్ అకాడమీ’లో ఏడాదిపాటు నటనలో శిక్షణ తీసుకుంది. తిరిగి వచ్చాక ‘స్పీక్ అప్’ అనే షార్ట్ ఫిలిమ్‌లో నటించింది ఆమె. అయితే ఈ మధ్యలో ఇన్‌స్టా రీల్స్‌తో, తన లేటెస్ట్ ఫొటోసూట్స్‌తో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను సంపాదించుకుంది. ఇన్‌స్టాలో దాదాపు పదిహేను లక్షలమంది ఆమెను ఫాలో అవుతున్నారు. తన ఆహార నియమాలు, వ్యాయామాల చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తూ... అభిమానులను ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. ఇవి కాకుండా పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్న ఖుషీ... పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది.
వర్కవుట్ ఇలా...
ఖుషీ కపూర్ వర్కవుట్స్‌లో పిలెట్స్ నుంచి ఫుల్‌బాడీ వర్కవుట్స్ వరకు అన్నీ ఉంటాయి.
ఉదయం ట్రెడ్‌మిల్‌పై జాగింగ్, రన్నింగ్‌లతో కూడిన కార్డియో సెషన్.
శరీరాన్ని అతిగా కష్టపెట్టకుండా, కావల్సిన ఫలితాలను ఇచ్చే వ్యాయామం పిలెట్స్. ఇది సులువుగా చేసుకోదగినది. కొన్నిసార్లు కార్డియోకు బదులుగా దీనిపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది ఖుషీ కపూర్.
వర్కవుట్‌కు ముందు, తరువాత మజిల్ స్ర్టెచింగ్. వ్యాయామాలకు ముందు స్ట్రెచింగ్ చేస్తే శరీరం వార్మప్ అవుతుంది. తరువాత చేస్తే శరీరం చల్లబడుతుంది. ముఖ్యంగా దీనివల్ల కండరాల పెళుసుదనం పోయి... వ్యాయామానికి అనుకూలంగా మారతాయి. పోశ్చర్ కూడా మెరుగవుతుంది.
ఖుషీ ఫిట్‌నెస్ సెషన్స్‌లో రోజూ ఒకేరకమైన వ్యాయామాలు ఉండవు. బోర్ కొట్టకుండా బ్యాడ్మింటన్, టెన్నిస్‌లాంటి ఏదో ఒక ఆట దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలంటుంది ఖుషీ. ఆట సరదాతో పాటు మానసిక ఉల్లాసాన్నిస్తుందనేది ఆమె ట్రైనర్ మాట.
వెయిట్స్, స్క్వాట్స్ సెషన్స్. కండరాలు దృఢంగా తయారవ్వడానికి, సామర్థ్యం పెరగడానికి ఇవి దోహదపడతాయి.
ఫుల్ బాడీ వర్కవుట్. శరీరంలోని అన్ని భాగాలకూ వ్యాయామం లభిస్తుంది. దీనివల్ల శారీరక దృఢత్వంతో పాటు బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్నిటికీ మించి ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి క్రమం తప్పని వ్యాయామం సంజీవనిలా పని చేస్తుంది.
ఇదీ మెనూ...
ఖుషీ మెనూ పుష్కలంగా విటమిన్లు, పోషకాలు, పీచుపదార్థాలతో ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం ఉంటుంది.
ఉదయం తాజా పండ్లు, ఎగ్‌వైట్, ఓట్స్
మధ్యాహ్నం భోజనంలో వెజిటబుల్ సలాడ్, చికెన్‌తో బ్రౌన్‌రైస్, పప్పు. లేదంటే శాండ్‌విచ్.
రాత్రి డిన్నర్‌లో కూడా దాదాపు లంచ్ తరహా ఆహారమే ఉంటుంది.
పంచదారతో తయారు చేసిన వంటలు, ద్రావకాలు, జంక్‌ఫుడ్స్‌కు దూరం
రోజంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి పుష్కలంగా నీళ్లు తాగుతుంది.