మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RIP Dolly Sohi: బాలీవుడ్‌ టీవీ ఇండస్ట్రీలో విషాదం.. నటి డాలీ కన్నుమూత

ABN, Publish Date - Mar 08 , 2024 | 03:14 PM

టెలివిజన్‌ నటి డాలీ సోహి కన్నుమూశారు. కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. తన సోదరి అమన్‌దీప్‌ కామెర్లకు చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే డాలీ కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది

టెలివిజన్‌ నటి డాలీ సోహి(Dolly sohi) కన్నుమూశారు. కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. తన సోదరి అమన్‌దీప్‌ కామెర్లకు చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే డాలీ కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ‘డాలీ, అమన్‌దీప్‌ ఇద్దరూ ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అమన్‌దీప్‌ గురువారం సాయంత్రం కన్నుమూశారు. డాలీ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు’ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. హిందీలో పలు సీరియల్స్‌లో నటించిన డాలీ గతేడాదిలో కీమోథెరపీ చేయించుకున్న ఫొటోలను ఇన్‌స్ట్టాలో పంచుకున్నారు.


‘పోరాడే శక్తి మీలో ఉంటే ఎంత కష్టమైన ప్రయాణమైనా.. సులభం అవుతుంది. క్యాన్సర్‌ వచ్చిందని బాధపడుతూ ఉండిపోవాలా.. లేదంటే ధైౖర్యంగా దాన్ని ఎదుర్కొని ఆదర్శంగా నిలవాలో మన చేతిలోనే ఉంటుంది’ అని అందరిలో ధైర్యాన్ని నింపేలా పోస్ట్‌ చేశారు.  హిందీలో ‘రనక్‌’, ‘మేరీ ఆషికీ తుమ్సే హి’ వంటి సీరియల్స్‌తో డాలీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తాజాగా ఆమె మరణంతో హిందీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

Updated Date - Mar 08 , 2024 | 03:15 PM