మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhumi Pednekar: 'భక్షక్‌’ మరింత ప్రత్యేకం.. అసలు వదులుకోను!

ABN, Publish Date - Feb 19 , 2024 | 10:39 AM

బాలీవుడ్‌ బ్యూటీ భూమి పెడ్నేకర్‌ తాజాగా నటించిన చిత్రం 'భక్షక్‌’. పులకిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన ప్రాణాలను పణంగా పెట్టి.. అమ్మాయిల అక్రమ రవాణా ఛేదించే మహిళా జర్నలిస్ట్‌ వైశాలి సింగ్‌ పాత్రలో నటించి మెప్పించింది భూమి.

బాలీవుడ్‌ బ్యూటీ భూమి పెడ్నేకర్‌ తాజాగా నటించిన చిత్రం 'భక్షక్‌’. పులకిత్  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన ప్రాణాలను పణంగా పెట్టి.. అమ్మాయిల అక్రమ రవాణా ఛేదించే మహిళా జర్నలిస్ట్‌  వైశాలి సింగ్‌ పాత్రలో నటించి మెప్పించింది భూమి. ఈ నెల 9న చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించింది. సినీ పరిశ్రమ, విమర్శలకు నుంచి సినిమాకు, ఆమె పాత్రకు చక్కని ప్రశంసలు రావడంతో భూమి స్పందించారు.'మహిళను శక్తిమంతురాలిగా.. సమాజంలో మార్పు తీసుకొచ్చే పోరాట యోధురాలిగా చూపించే.. ఏ పాత్రను నేను వదులుకోను. సినీ పరిశ్రమ, మీడియా, ప్రేక్షకులు.. అత్యుత్తమంగా నటించానని మెచ్చుకుంటుంటే.. ఒక నటికి అంతకన్నా సంతోషకరమైన క్షణాలు ఏముంటాయి. నా కెరీర్‌, వృత్తి జీవితంలో ఇవి ఉద్విగ్నభరితమైన రోజులు. నేను అంగీకరించి మనసు పెట్టి పని చేసిన ప్రతి చిత్రానికి నా హృదయంలో చోటుంటుంది. వాటిన్నింటిలో భక్షక్‌’ మరింత ప్రత్యేకం. ఎందుకంటే.. సమాజంలో మంచి మార్పునకు కారణమయ్యే ఓ మహిళా ప్రతినిధి పాత్రను ఈ చిత్రంలో పోషించాను. సమాజ మార్పు కోసం నాయకురాలిగా మారి, విజయం సాధించిన అమ్మాయి పాత్రలతో తీసిన చిత్రాలు మన దగ్గర అరుదుగా వస్తుంటాయి. అందులో శక్తిమంతమైన మహిళ.. జాతి నిర్మాణంలో పాలు పంచుకొనే స్త్రీ. అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపించే మహిళ. తమ హక్కుల కోసం నినదించే వనిత.. ఇలాంటి ఏ పాత్ర అయిన తప్పకుండా అంగీకరిస్తా. ఇలాంటి పాత్రలు పోషించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఈ తరహా పాత్రలనే కొన్నేళ్ల తర్వాత కూడా గుర్తు చేసుకోగలం’’ అని అన్నారు.


ఈ ప్రేమను ఊహించలేదు...
‘‘నా పాత్రను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. తమ హృదయాల్లో పెట్టుకున్నందుకు ప్రేక్షకు ధన్యవాదాలు. అంత ప్రేమను ప్రేక్షకుల నుంచి ఊహించలేదు. నేను మనసు పెట్టి పని చేయడానికి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు పుల్కిత్‌, నిర్మాణ సంస్థ రెడ్‌చిల్లీస్‌, రచయిత జ్యోత్స్ననాథ్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని చేయడానికి ప్రయత్నిస్తా’’

Updated Date - Feb 21 , 2024 | 06:51 PM