Bhool Bhulaiyaa 3: బాలీవుడ్‌లో హారర్ కామెడీ సినిమాల జోరు.. సక్సెస్ మంత్ర చెప్పేసిన డైరెక్టర్

ABN, Publish Date - Nov 02 , 2024 | 04:44 PM

శుక్రవారం (నవంబర్ 1) రిలీజైన 'భూల్ భూలయా 3' ఊహించన దానికంటే ఎక్కువ ఓపెనింగ్స్ సాధించి అదరగొడుతుంది. చంద్రముఖి సినిమాకి రీమేక్‌గా డైరెక్టర్ అనీస్ బజ్మీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా సక్సెస్ మంత్ర తెలిపారు. ఇంతకీ ఆ సక్సెస్ మంత్ర ఏంటంటే..

ప్రస్తుతం బాలీవుడ్‌లో హారర్, కామెడీ సినిమాల హవా పెరిగింది. ఈ ఏడాది రిలీజైన 'స్ట్రీ 2' ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక శుక్రవారం (నవంబర్ 1) రిలీజైన 'భూల్ భూలయా 3' ఊహించన దానికంటే ఎక్కువ ఓపెనింగ్స్ సాధించి అదరగొడుతుంది. చంద్రముఖి సినిమాకి రీమేక్‌గా డైరెక్టర్ అనీస్ బజ్మీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా సక్సెస్ మంత్ర తెలిపారు. ఇంతకీ ఆ సక్సెస్ మంత్ర ఏంటంటే..


కార్తీక్ ఆర్య‌న్ ( Kartik Aaryan), త్రిప్తి డిమ్రి (Triptii Dimri), విద్యా బాల‌న్ (Vidya Balan), మాధురి దీక్షిత్ (Madhuri Dixit) కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన కామెడీ హ‌ర్ర‌ర్‌ చిత్రం భూల్ భూలయ్యా3 (Bhool Bhulaiyaa 3). మొద‌ట‌గా 2007, 2022ల‌లో వ‌చ్చిన ఈ సిరీస్‌ చిత్రాల‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించగా, ఇంతకు ముందు భాగాలలో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా మొదటి రోజే 45 కోట్లు కొల్లగొట్టి మంచి ఓపెనింగ్స్ సంపాదించింది. వీకెండ్ కావడంతో ఈరోజు, రేపు కూడా మంచి ఓపెనింగ్స్ పక్క అంటూ సినీ పండితులు జోష్యం తెలిపారు.


మరోవైపు ఈ సినిమా డైరెక్టర్ అనీస్ బజ్మీ మాట్లాడుతూ.. "ఈ సినిమాకి సక్సెస్ కి స్టార్ కాస్ట్ ప్రధాన కారణం. విద్యా బాలన్, మాధురి దీక్షిత్‌ల పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక త్రిప్తి, కార్తీక్ చాలా ఫ్రెష్ యాక్టింగ్ చేశారు. మూవీ సిరీస్‌కి పిల్లర్స్‌గా నిలుస్తున్న సంజయ్ మిశ్రా, రాజ్‌పాల్ యాదవ్, అశ్వినీ కాల్సేకర్ త్రయం వీరే నా సక్సెస్ మంత్ర. ఇక నా కథే నా సక్సెస్ మంత్ర. సినిమా స్టార్ట్ షూట్ ప్రారంభం కాకముందు ఒక్కో యాక్టర్ ఒక్కో విధమైన పాత్రా చేసి వస్తారు. దీంతో మొదట్లో ఈ సినిమాకి సంబంధించిన రోల్స్ ఇమడటం కష్టం అవుతుంది. కానీ డే 1 నుండే నాకు సెట్ లో పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. యాక్టర్స్ అందరు తమ యాక్టింగ్ తో నన్ను ఆశ్చర్యపరిచారు. ఉదాహరణకి కార్తీక్ చందు చాంఫియన్ లాంటి క్యారెక్టర్ చేసి ఇందులోనూ ఇమిడిపోవటం నా సక్సెస్ ప్రధాన కారణం" అని చెప్పుకొచ్చారు.

Updated Date - Nov 02 , 2024 | 04:44 PM