అల్లు అర్జున్‌ హీరోయిన్‌ ఇంట విషాదం

ABN, Publish Date - Dec 16 , 2024 | 01:40 PM

అల్లు అర్జున్‌ ‘వరుడు’ (varudu) సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైంది భానుశ్రీ మెహ్రా (Bhanushree Mehra) . ఆ తర్వాత కూడా తెలుగులో అవకాశాలు అందుకున్నా.. పేరు అయితే పెద్దగా రాలేదు.

అల్లు అర్జున్‌ ‘వరుడు’ (varudu) సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైంది భానుశ్రీ మెహ్రా (Bhanushree Mehra) . ఆ తర్వాత కూడా తెలుగులో అవకాశాలు అందుకున్నా.. పేరు అయితే పెద్దగా రాలేదు. దీంతో ఐదేళ్ల క్రితం కరణ్‌ మానస్‌ (Karan Manas) అనే వ్యక్తిని పెళ్లిచేసుకుని సెటిలైపోయింది. ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈమె సోదరుడు నందు.. ఏడు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో చనిపోయాడు. ఈ క్రమంలోనే అతడిని తలుచుకుని భావోద్వేగానికి లోనవుతుంది.

సోషల్‌ మీడియాలో తన సోదరుడితో ఉన్న జ్ఞాపకాల్ని పంచుకుంది. ‘‘నువ్వు చనిపోయి ఏడు రోజులైంది. కానీ ఇంకా పీడ కలలా ఉంది. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి? నువ్వు లేకపోవడంతో కుటుంబంలో స్తబ్దుగా మారింది. ప్రతి చిన్న విషయంలోనూ నువ్వే గుర్తొస్తున్నావ్‌. నువ్వు లేవనే బాధను.. జీవితాంతం నేను మోయాల్సిందే. నా మనసులో ఎప్పటికీ నీకు చోటుంటుంది. ఐ లవ్‌ యూ. నందు ఐ మిస్‌ యూ’ అని భానుశ్రీ తన బాధను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.  

Updated Date - Dec 16 , 2024 | 01:40 PM