మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Avantika Vandanapu: బాలీవుడ్ రొమాంటిక్ వెబ్‌సిరీస్‌లో.. తెలుగు, హాలీవుడ్ బ్యూటీ అవంతిక‌

ABN, Publish Date - Mar 10 , 2024 | 05:25 PM

గ‌త కొంత‌కాలంగా సోష‌ల్‌మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్న యువ న‌టి అవంతిక వంద‌న‌పు తాజాగా త‌ను న‌టిస్తోన్న ఓ బాలీవుడ్ హిందీ సిరీస్ త్వ‌ర‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న‌ది.

Big Girls Dont Cry

గ‌త కొంత‌కాలంగా సోష‌ల్‌మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్న యువ న‌టి అవంతిక వంద‌న‌పు (Avantika Vandanapu). తెలుగులో మ‌హేశ్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి న‌టుల‌తో బాల న‌టిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ చిన్న‌ది ఇప్పుడు హాలీవుడ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకెళుతున్న‌ది. ఆ మ‌ధ్యే త‌ను న‌టించిన మీన్ గ‌ర్ల్ 2 (Mean Girls 2) విడుద‌లై అవంతిక (Avantika Vandanapu) కు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీని తీసుకురాగా మ‌రో ఎండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి.

ఈ క్ర‌మంలో తాజాగా త‌ను న‌టిస్తోన్న ఓ బాలీవుడ్ హిందీ సిరీస్ త్వ‌ర‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న‌ది. ఈ సిరీస్‌కు కరణ్ కపాడియా (Karan Kapadia), నిత్యా మెహ్రా (Nitya Mehra), కోపాల్ నైతాని (Kopal Naithani), సుధాంషు సరియా (Sudhanshu Saria) వంటి న‌లుగురు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అవంతిక వంద‌న‌పు (Avantika Vandanapu), పూజా భట్ (Pooja Bhatt), రైమా సేన్ (Raima Sen), లీనా శర్మ (Leena Sharma), ముకుల్ చద్దా (Mukul Chadda), జోయా హుస్సేన్ (Zoya Hussain) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవ‌లే ట్రైల‌ర్ విడులద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. మార్చి 14 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(PrimeVideoIN)లో స్ట్రీమింగ్ కానుంది.


వంద‌న వ్యాలీలోని ఓ బోర్డింగ్ స్కూల్‌లో ఏడుగురు గ‌ర్ల్స్ మ‌ధ్య జ‌రిగే ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కించారు. ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం కోసం కొట్లాడుకోవ‌డం, గొడ‌వ‌లు, ల‌వ్, ల‌స్ట్‌, లెస్బియ‌న్ ఇలా ప‌లు ఆస‌క్తిక‌రమైన అంశాల‌తో నేటి యూత్‌ను ఆక‌ట్టుకునే క‌థాంశంతో రూపొందించారు.

ఇందులో అవంతిక (Avantika Vandanapu) ఇండిపెండెంట్ గ‌ర్ల్‌గానే కాకుండా లెస్బియ‌న్ అనే కోణంలో చూపించిన‌ట్లు ట్రైల‌ర్‌ను చూస్తే తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా చాలాకాలం త‌ర్వాత పూజా భ‌ట్ (Pooja Bhatt) ప్రిన్పిప‌ల్ ఇందులో ఓ కీల‌క పాత్ర న‌టించ‌నుండ‌డం విశేషం.

Updated Date - Mar 10 , 2024 | 05:25 PM