Salman Khan: అట్లీతో సినిమా అంటూ ప్రచారం.. నిజమేనా!  

ABN, Publish Date - Jun 22 , 2024 | 11:17 AM

                    బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం ‘సికందర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

                   
బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం ‘సికందర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రష్మిక మందన్నా కథానాయిక. సల్మాన్ ఇప్పుడు మరో సినిమాను క్యూలో పెట్టారు.  ‘జవాన్‌’తో (Jawan) హిట్‌ కొట్టిన దర్శకుడు అట్లీతో(Atlee).. సల్మాన్‌ ఓ సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని బాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం. కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్‌ కోసం సల్మాన్‌, అట్లీల మఽధ్య చర్చలు నడుస్తున్నాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నారు.

ఇందులో ఇద్దరు హీరోలు నటించే అవకాశం ఉందట. సల్మాన్‌తో పాటు మరో కథానాయకుడిని దక్షిణాది నుంచి ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారట చిత్రబృందం. మునుపెన్నడూ చూడని విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు దర్శకుడు అట్లీ. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు  ముగింపు దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది చిత్రీకరణను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నారు’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సన్  పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది.

Updated Date - Jun 22 , 2024 | 11:17 AM