Deepfake: డీప్ ఫేక్.. ఏకంగా అమితాబ్ బచ్చన్ విషయంలో..

ABN, Publish Date - Dec 03 , 2024 | 10:03 PM

సాంకేతికతను దుర్వినియోగపరుస్తూ కొన్ని కుటుంబాల పరువును బజారుకీడుస్తున్న ఘటనలు సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చిన కొత్తలో ఈ సాంకేతికతను వినియోగించి కొందరు సెలబ్రెటీలకు సంబంధించి ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించిన దుండగులు తాజాగా.. ఏఐ సాయంతో జరగనివాటిని జరిగినట్లు సృష్టిస్తూ ప్రముఖమైన..

సాంకేతికత పెరుగుతోంది.. దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశించేలోపు కొందరు కేటుగాళ్లు టెక్నాలజీ పేరు చెబితే బయపెట్టే పనులు చేస్తున్నారు. దీంతో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషపడాలా.. బాధపడాలో అర్థంకాని పరిస్థితులు నేటి సమాజంలో నెలకొన్నాయి. సాంకేతికతను దుర్వినియోగపరుస్తూ కొన్ని కుటుంబాల పరువును బజారుకీడుస్తున్న ఘటనలు సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చిన కొత్తలో ఈ సాంకేతికతను వినియోగించి కొందరు సెలబ్రెటీలకు సంబంధించి ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించిన దుండగులు తాజాగా.. ఏఐ సాయంతో జరగనివాటిని జరిగినట్లు సృష్టిస్తూ ప్రముఖమైన వ్యక్తుల పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారు. ఇప్పటికే కొందరు హీరోయిన్లు ఒకరికి మరొకరు ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలను ఏఐ సాయంతో నకిలీవి సృష్టిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన కోడలికి లిప్ కిస్ పెడుతున్న ఓ నకిలీ వీడియోను సృష్టించి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే అమితాబ్ బచ్చన్ తీవ్ర ఆగ్రహంతో పాటు, ఆందోళన వ్యక్తం చేశారు. కోపంగా ఉన్న ఎమోజీని అమితాబ్ పోస్టు చేశారు. ఏఐను ఉపయోగించి ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు తయారుచేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఇటీవల కాలంలో గట్టిగా వినిపిస్తోంది.


డీప్ ఫేక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో అమితాబ్ తన కోడలు పెదాలపై ముద్దుపెడుతున్నట్లు ఓ నకిలీ వీడియోను సృష్టించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో అమితాబ్ ఐశ్వర్యరాయ్‌కు ముద్దుపెడుతున్నట్లు వీడియో వైరల్ అవుతోంది. భవిష్యత్తుల్లో ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు మరిన్ని వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి నకిలీ వీడియోల కారణంగా కుటుంబ బంధాలు చెడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఓవైపు ఐశ్యర్యరాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య విడాకుల గురించి పుకార్లు వినిపిస్తున్నవేళ ఇలాంటి ఫేక్ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వెనుక కుట్ర ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తున్న కేటుగాళ్లు రానున్న రోజుల్లో సామాన్యులకు సంబంధించిన ఇలాంటి వీడియోలను సృష్టిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఊహించడమే కష్టం. సాంకేతికతను మంచి ఉద్దేశంతో ఉపయోగించినప్పుడు కలిగే లాభాలకంటే.. దురుద్దేశంతో ఉపయోగించినప్పుడు కలిగే నష్టాలు ఎక్కువుగా ఉంటాయనే సాంకేతిక రంగ నిపుణులు చెబుతున్నారు.


పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించిన నేపథ్యంలో ప్రభుత్వాలు సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కొందరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తూ బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తేఅవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈక్రమంలో డీప్ ఫేక్ వీడియోను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ వినిపిస్తోంది.

Updated Date - Dec 03 , 2024 | 10:03 PM