Jaya Bachchan: అన్ని షిప్టులా.. అయితే నాకొద్దు అన్నారు
ABN, Publish Date - Jul 24 , 2024 | 02:09 PM
బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) తన సతీమణి జయా బచ్చన్‌కు (Jaya bachchan) పెళ్లికి ముందే కొన్ని కండీషన్స్ పెట్టారట.
బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) తన సతీమణి జయా బచ్చన్‌కు (Jaya bachchan) పెళ్లికి ముందే కొన్ని కండీషన్స్ పెట్టారట. వివాహం తర్వాత వృత్తి కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన మాట తీసుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా జరిగిన పాడ్‌కాస్ట్‌లో జయాబచ్చన్ తెలియజేశారు.
‘‘పెళ్లి నాటికి నేను నటిగా రాణిస్తున్నా. వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నా. వృత్తిపరమైన కమిట్మెంట్స్ పూర్తి చేసుకొని 1973 అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. అదే సమయంలో ఆయన నాకొక కండీషన్ పెట్టారు. 9-5 షిఫ్టుల్లో పని చేసే భార్య తనకు వద్దన్నారు. వర్క్ చేయడానికి అంగీకరించారు కానీ, రోజూ షూటింగ్స్‌కు వెళ్లడానికి కుదరదన్నారు. మంచి సినిమాలు ఎంచుకొని, సరైన మనుషులతో వర్క్ చేయాలని తెలిపారు. ‘జంజీర్’ సక్సెస్ తర్వాత మేమిద్దరం టూర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆ విషయం వాళ్లింట్లో తెలిసింది. పెళ్లికి ముందు ఇలాంటి విహారయాత్రలకు వెళ్లడానికి వీల్లేదన్నారు. జూన్‌లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అదే విషయాన్ని ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్లతో పెళ్లి గురించి మాట్లాడారు. అప్పుడే పెళ్లి చేయాలని మా నాన్న అనుకోలేదు. కానీ, మా ఇష్టాన్ని గౌరవించి జూన్ 1973లో మాకు పెళ్లి చేశారు’’ అని జయా బచ్చన్ తెలిపారు.