మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Deepika Padukone: ఆ హక్కు మీకు ఎవరిచ్చారు... జర్నలిస్ట్‌ కౌంటర్‌. సెలబ్రిటీల మద్దతు!

ABN, Publish Date - May 23 , 2024 | 07:09 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కానున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) త్వరలోనే తల్లి కానున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో (Ranveer singh) కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే. దీపికి చాలా జాగ్రత్తగా తన బేబీ బంప్‌పై (baby bump) చేయి వేసుకుని మెల్లగా నడుచుకుంటూ పోలింగ్‌ బూత్లోకి వెళ్లిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. భర్త రణ్‌వీర్‌ కూడా తనని ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి ఓటు వేయించి మళ్లీ కారు ఎక్కే వరకూ తన చెంతనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఎన్నికల రోజు వీడియోల రూపంలో హల్‌చల్‌ చేశాయి. అయితే, ఇప్పుడు కొందరు నెటిజన్లు దీపికా బేబీ బంప్‌పై ట్రోలింగ్‌ చేస్తూ నెగెటివ్‌ కామెంట్స్‌ పెట్టారు. వీటిని వ్యతిరేకిస్తూ ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌కు బాలీవుడ్‌ ప్రముఖులు స్పందిస్తూ మద్దతు పలుకుతున్నారు. దీపికా ప్రెగ్నెంట్‌ కాదని.. బేబీ బంప్‌ ఫేక్‌ అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు. (Alia bhatt Support to Deepika padukone)

దీనిపై ఫయీ డిసౌజా అనే  జర్నలిస్ట్‌ స్పందిస్తూ తన సోషల్‌ మీడియా పేజీలో పోస్ట్‌ పెట్టారు. ‘డియర్‌ సోషల్‌ మీడియా.. ప్రజాస్వామ్యం తనకు ఇచ్చిన ఓటు హక్కును దీపికా పదుకొణె వినియోగించుకున్నారు. అందుకే బయటకు వచ్చారు. ఆమె శరీరం, ఆమె గర్భం గురించి మీ అభిప్రాయాన్ని ఎవరూ అడగలేదు. ఆమె జీవితంలోని ఏ విషయంపైనా కామెంట్‌ చేసే అధికారం ఎవరికీ లేదు. ట్రోలింగ్‌ ఆపేసి.. హద్దులో ఉండండి’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ పెట్టిన వెంటనే బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ అలియా భట్‌ లైక్‌ చేసి ‘బాగా చెప్పారు’ అని కామెంట్‌ చేశారు. మరికొంతమంది సెలబ్రిటీలు సైతం సదరు జర్నలిస్ట్‌ పోస్ట్‌కి లైక్‌ కొట్టి షేర్‌ చేస్తున్నారు. మరోవైపు దీపికాకు సపోర్ట్‌ చేసినందుకు ఆమె అభిమానులు అలియాకు థ్యాంక్స్‌ చెబుతున్నారు. 

Updated Date - May 23 , 2024 | 08:15 PM