Alia bhatt: అదే నా సమస్య.. నా భర్త అర్థం చేసుకున్నారు!
ABN, Publish Date - Oct 12 , 2024 | 08:20 PM
బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ ఓ ఇబ్బంది పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా కరీనా కపూర్ ఖాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఆమె ఈ విషయాలను పంచుకుంది.
బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ (Alia Bhatt) ఓ ఇబ్బంది పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా కరీనా కపూర్ ఖాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఆమె ఈ విషయాలను పంచుకుంది. ఈ సమస్య విషయంలో భర్త రణ్‌బీర్ కపూర్ తనకెంతో మద్దతుగా నిలిచినట్లు అలియా చెప్పుకొచ్చింది. ‘‘రాహా పుట్టిన తర్వాత ఆమె ఫొటోను పంచుకోకపోతే జనాలు ఏమనుకుంటారోనని అనుకునేదాన్ని. నాకు కాస్త అసౌకర్యంగా ఉండేది. ఎందుకంటే తను చాలా చిన్న పాప. తను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ కాకూడదు. 2023లో క్రిస్మస్ సందర్భంగా లంచ్ చేద్దామని కారులో బయలుదేరాం. అప్పుడు రణ్‌బీర్ ‘మనం రాహాతో కలిసి ఈ రోజు ఫొటో దిగుదామా’ అని అడిగాడు.
నేను ఒక్కసారిగా కంగారుపడ్డాను. ‘నువ్వు నిజంగా అంటున్నావా’ అని అన్నాను. ఎందుకంటే నాకెందుకో ఆందోళనగా అనిపించింది. ప్రతి క్షణం అలాగే అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అది మరింత తీవ్రంగా ఉంటుంది. నా పరిస్థితిని రణ్‌బీర్ అర్థం చేసుకున్నాడు. వేరే విషయాల గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. బాంద్రా, జుహూ ఇలా ఏదో ఒకటి మాట్లాడేవాడు. ఇదంతా జీవితంలో ఒక బాగమని కొన్నాళ్ల తర్వాత నాకు అర్థమైంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆలియాభట్ కథానాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేస్తూనే కమర్షియల్ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ‘జిగ్రా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. ప్రస్తుతం ‘ఆల్ఫా’ చిత్రంలో నటిస్తోంది.