మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Aksha Pardasany: మనసులు కలిశాయి.. ప్రార్థనలు ఫలించాయి!

ABN, Publish Date - Feb 27 , 2024 | 11:54 AM

'యువత’, 'రైడ్‌’ చిత్రాలతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అక్ష పార్దసాని పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడితో ఏడడుగులు వేశారు. బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ కౌశల్‌ని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది వీరి నిశ్చితార్థం జరగ్గా.. ఫిబ్రవరి 26న గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారు.

'యువత’, 'రైడ్‌’ చిత్రాలతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అక్ష పార్దసాని (Aksha Pardasany) పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడితో ఏడడుగులు వేశారు. బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ కౌశల్‌ని (Kaushal)ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది వీరి నిశ్చితార్థం జరగ్గా.. ఫిబ్రవరి 26న గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారు. ఈ ఫొటోలను షేర్‌ చేసిన అక్ష.. ‘మా ప్రార్థనలు ఫలించాయి. మేమిద్దరం ఒక్కటయ్యాం. దేవుడి దయతో పాటు మా ఇరు కుటుంబాల ఆశీర్వాదాలు మాకెప్పుడూ ఉంటాయి’ అని ఇన్ స్టాలో క్యాప్షన్‌ పెట్టారు.


దీంతో నెటిజన్లు, సెలబ్రిటీలు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరి వివాహంలో పెళ్లి కొడుకు ఎంట్రీ ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు సరదా కామెంట్స్‌ పెడుతున్నారు. కౌశల్‌ సినిమాటోగ్రాఫర్‌ కావడంతో మండపానికి కెమెరా క్రేన్‌పై ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ వీడియోలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘కెమెరా మ్యాన్‌ అనిపించుకున్నావ్‌’, ‘డిఫరెంట్‌ థాట్‌ ఇది’ అంటూ  కామెంట్స్‌ పెడుతున్నారు. (Aksha Pardasany Got Marriage)


చిన్నతనంలోనే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టిన అక్ష.. ఇప్పటి వరకు 75కు పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించారు. సినిమాలపై ఆసక్తితో 2004లో ‘ముసాఫిర్‌’ అనే చిత్రంతో బాలనటిగా  ఇండస్ట్రీలో  అడుగుపెట్టారు.

మలయాళ చిత్రం 'గోల్‌’తో హీరోయిన్ గా  పరిచయమైంది. తెలుగులో ‘యువత’, ‘రైడ్‌’, ‘కందిరీగ’, ‘బెంగాల్‌ టైగర్‌’, 'డిక్టేటర్‌’, 'రాధా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. దక్షిణాదిలో మొత్తం 16 కు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు.


Updated Date - Feb 27 , 2024 | 12:35 PM