Aishwarya Rai - Cannes: ఈసారి ఎలా కనిపించబోతుందో అనే ఆతురత!
ABN, Publish Date - May 16 , 2024 | 11:41 AM
కొన్నేళ్లగా కేన్స్ చిత్రోత్సవాల్లో సందడి చేస్తున్నారు ఐశ్వర్యారాయ్. విదేశీ భామలు ఎంతమంది ఉన్న ఐష్ మాత్రం ఈ వేడుకకు ప్రత్యేక కళ తీసుకొస్తారు. ప్రస్తుతం జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా ఆమె హాజరుకానున్నారు.
కొన్నేళ్లగా కేన్స్ చిత్రోత్సవాల్లో (77Th Cannes Film Festival) )సందడి చేస్తున్నారు ఐశ్వర్యారాయ్(Aishwarya Rai). విదేశీ భామలు ఎంతమంది ఉన్న ఐష్ మాత్రం ఈ వేడుకకు ప్రత్యేక కళ తీసుకొస్తారు. ప్రస్తుతం జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా ఆమె హాజరుకానున్నారు. అయితే ఈసారి తన కుమార్తెను కూడా తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కుడిచేతికి కట్టుతో (Aishwarya Rai hand injury) కనిపించారు ఐశ్వర్యా. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆమె చేతికి ఏమైందో అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ గాయంతో కేన్స్ ఎర్ర తివాచీపై (Cannes red carpet) ఎలా నడుస్తారంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. గాయమైనప్పటికీ కేన్స్‌కు సిద్థం కావడం పట్ల తన డెడికేషన్ ఏంటో అర్థమైంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతి సంవత్సరం కేన్స్ వేదికపై ఐశ్వర్య తనదైన శైలి లుక్‌లో కనిపించి ఆహుతులను ఆకర్షిస్తారు. విభిన్నమైన కాస్ట్యూమ్‌లతో కనిపించి ట్రెండింగ్ అవుతుంటారు. ఈ ఏడాది ఆమె ఎలా కనిపిస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె కనిపించగానే తమ కెమెరాల్లో క్లిక్‌మనిపించేందుకు వందల మంది ఫొటోగ్రాఫర్లు సిద్థంగా ఉన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ వేదికగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది.
Kajal: అతని సలహా... ఇతని కోసం చేశా!
ఈ నెల 25 వరకూ జరగబోయే ఈ వేడుకలో సినీతారలు, సెలబ్రిటీలు నూతన డిజైన్లతో రెడ్ కార్పెట్‌పై హొయలొలికిస్తూ ఉంటారు. ఇప్పటికే ఊర్వశీ రౌతేలా పింక్ కలర్ స్టైలిస్ డ్రెస్సులో మెరిశారు. ఈ వేడుకల్లో ఐశ్వర్య తోపాటు శోబితా ధూళిపాళ, అదితి రావు హైదరీ, కియారా అడ్వాణి సందడి చేయనున్నారు.
గతంలో కేన్స్ వేదికపై సందడి చేసిన ఐష్ ఫొటోలపై ఓ లుక్కేయండి...