Urmila Matondkar: తనకంటే 10 ఏళ్ల చిన్నవాడితో పెళ్లి.. 8 ఏళ్లకే విడాకులు
ABN, Publish Date - Sep 25 , 2024 | 09:15 PM
‘యాయి రే యాయి రే’ అంటూ నైంటీస్‌లో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన భామ ఊర్మిళ మటోండ్కర్ . ఇప్పుడీ భామ వార్తల్లో హైలెట్ అవుతోంది. ఈ మధ్య సెలబ్రిటీలు చాలా మంది విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడా లిస్ట్‌లోకి ఊర్మిళ కూడా చేరింది. తన కంటే 10 ఏళ్ల చిన్నోడిని పెళ్లాడిన ఊర్మిళ.. పెళ్లయిన 8 ఏళ్లకే విడాకులు తీసుకోవడానికి కారణం..
‘యాయి రే యాయి రే’ అంటూ నైంటీస్‌లో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన భామ ఊర్మిళ మటోండ్కర్ (Urmila Matondkar). ఇప్పుడీ భామ వార్తల్లో హైలెట్ అవుతోంది. మోడల్ కమ్ బిజినెస్ మ్యాన్ అయిన తన భర్త మోసిన్ అఖ్తర్ మీర్(Mohsin Akhtar Mir)కి విడాకులు ఇచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పలు నేషనల్ మీడియా ఛానెల్స్ ఈ వార్తను ప్రచారం చేయడంతో ఇప్పుడు సర్వత్రా ఈ చర్చ నెలకొంది. అయితే 4 ఫిబ్రవరి, 2016లో ఈ జంట ఊర్మిళ నివాసంలోనే దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లాడారు. వయసులో తనకంటే పదేళ్ల చిన్న వాడైనా కూడా.. పర్సనల్ వాల్యూస్, ఇంట్రెస్ట్స్ కలవడంతో మోసిన్‌ను ఊర్మిళ పెళ్లాడింది. ఎనిమిదేళ్ల వివాహ బంధం అనంతరం ఈ జంట మ్యూచువల్ డైవర్స్ (Mutual Divorce)కి అప్లై చేసినట్లు సమాచారం. అయితే ఈ విడాకులకు అసలు కారణాలేంటనేది తెలియాల్సి ఉంది.
Also Read- Devara: వార్స్ వద్దు.. ‘దేవర’ అభిమానులకు నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్
ఊర్మిళ మటోండ్కర్ విషయానికి వస్తే.. శేఖర్ కపూర్ (Shekar kapoor) మాసూమ్(Masoom) చిత్రం ద్వారా సిల్వర్ స్క్రీన్‌కి చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన ఊర్మిళ.. రాంగోపాల్ వర్మ(RGV) చిత్రాలైన ‘రంగీలా, సత్య, కోన్’ చిత్రాలతో తిరుగులేని తారగా ఎదిగారు. ఆ తరువాత ‘జుదాయి, మస్త్, ఖూబ్సూరత్, ప్యార్ తునే క్యా కియా భూత్ మరియు ఏక్ హసీనా థీ’ మొదలగు చిత్రాలలో కనిపించారు. చివరగా ఆమె 2014లో అజూబా అనే మరాఠి సినిమాలో నటించగా, 2018లో వచ్చిన బ్లాక్ మెయిల్ మూవీలోని ఓ పాటలో కనిపించారు. మరో వైపు ఆమె భర్త మోసిన్ అఖ్తర్ ‘ఇట్స్ ఎ మ్యాన్స్ వరల్డ్, లక్ బై ఛాన్స్, ముంబై మస్త్ కల్లాందర్ మరియు బి.ఎ. పాస్’ వంటి ప్రాజెక్ట్స్‌లో కనిపించారు.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల విడాకులకు సంబంధించి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని వుడ్స్లో ఫేమస్ అయిన వారు విడాకుల తీసుకుంటుండటం గమనార్హం. ఇప్పుడా లిస్ట్‌లోకి ఊర్మిళ కూడా చేరారు. (RGV Heroine)