Adah Sharma: బాడీలో రకరకాల మార్పులు.. 48 రోజులు ఆగకుండా..
ABN, Publish Date - Jun 10 , 2024 | 09:42 AM
తాజాగా అదాశర్మ కూడా తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని వెల్లడించింది. దీని వల్ల ఎంతలా బాధపడాల్సి వస్తుందో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తెరపై హీరోయిన్లు గ్లామర్‌గా, ఫిట్‌గా కనిపించడానికి నానారకాల కసరత్తులు చేస్తుంటారు. కొన్నిసార్లు అరుదైన వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. గత రెండేళ్లగా టాలీవుడ్ అగ్రతార సమంత (Samantha) మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. సుధీర్ఘంగా చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాజాగా అదాశర్మ (Adah sharma) కూడా తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని (Rare disease) వెల్లడించింది. దీని వల్ల ఎంతలా బాధపడాల్సి వస్తుందో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "కేరళ స్టోరీ సినిమాలో నటించినప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘బస్తర్’ చిత్రంలో నటించినప్పుడు బరువు పెరిగాను. ఎందుకంటే ఆ చిత్రంలో బరువైన గన్స్ మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటు కాస్త బలంగా ఉండటానికి రోజు 10-12 అరటిపళ్లు తినేదాన్ని. అలానే గింజలు, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలు నాతో పాటు షూటింగ్‌కి తీసుకెళ్లాను. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డూలు తినేదాన్ని. ‘కానీ ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలో బరువు తగ్గడం-పెరగడం వల్ల నా బాడీలో రకరకాల మార్పులు రావడంతో ఒత్తిడికి గురయ్యాను. ఇది కాదన్నట్లు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తేలింది. దీని వల్ల పీరియడ్స్ ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజులపాటు నాన్ స్టాప్ పీరియడ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను’ అని అదాశర్మ చెప్పుకొచ్చింది.
1920 చిత్రంతో కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పూరి జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమమైంది. హయాతీ పాత్రతో ఆకట్టుకుంది. తెలుగులో వరుస చిత్రాలు చేసినా సరైన గుర్తింపు రాలేదు. దాంతో హిందీ చిత్రసీమకు షిప్ట్ అయింది. గత ఏడాది సుదీప్తో సేన దర్శకత్వం వహించిన ‘ద కేరళ స్టోరీ’ సూపర్‌హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘బస్తర్’ కూడా మంచి విజయాన్నే సాధించింది. ప్రస్తుతం సినిమాలతోపాటు పలు సిరీస్‌లతో బిజీగా ఉంది అదాశర్మ.