మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mithun Chakraborty: డిశ్చార్జ్‌ అయ్యా.. ఆరోగ్యంగానే ఉన్నా.. కానీ!

ABN, Publish Date - Feb 13 , 2024 | 03:49 PM

బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి మూడు రోజుల క్రితం తీవ్రమైన ఛాతీ నొప్పితో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలడగా ఉందని చెప్పారు.

బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి (Mithun Chakraborthy) మూడు రోజుల క్రితం  తీవ్రమైన ఛాతీ నొప్పితో  కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జ్‌ అయ్యారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలడగా ఉందని చెప్పారు. ఈ మేరకు  అయన మాట్లాడుతూ  "నేను బాగానే ఉన్నాను. ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే నా ఆహారపు అలవాట్లను కాస్త నియంత్రణలో ఉంచుకోవాలి. ఇక నేను నా పని మొదలుపెట్టాలి. రేపటి నుంచి షూటింగ్‌లో జాయిన్‌ అవ్వాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు తిట్టారు’ అని మిథున్ చక్రవర్తి  చెప్పుకొచ్చారు.

మిథున్‌ చక్రవర్తి 1976లో 'మృగయా' చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. హిందీ, బెంగాలీ, ఒడియా, బోజ్‌పురి, తెలుగు, తమిళ  భాషల్లో 350లకు పైగా చిత్రాల్లో నటించారు. మూడే జాతీయ పురస్కారాలతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.

Updated Date - Feb 13 , 2024 | 03:54 PM