Govinda: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్.. ఆ వెంటనే ఎమోషనల్
ABN, Publish Date - Oct 04 , 2024 | 07:44 PM
బుల్లెట్ మిస్‌ఫైర్ అయి గాయపడిన బాలీవుడ్ నటుడు గోవిందా.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్న ఆయన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అలాగే మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
ప్రమాదవశాత్తు గన్ పేలి గాయపడ్డ బాలీవుడ్ నటుడు (Bollywood Actor), శివసేన నేత గోవిందా (Govinda) ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీల్‌ఛైర్‌లో గోవిందా ఆస్పత్రి నుంచి బయటకు వస్తోన్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన్ని పలువురు అభిమానులు, ఫొటోగ్రాఫర్లు పరామర్శిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే తనపై ఇంతగా ప్రేమాభిమానాలు చూపించినవారికి మరియు తాను త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించినవారికి గోవిందా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read- Jr NTR: దర్శకుడు కొరటాల శివపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు
అంతేకాకుండా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు ముంబై పోలీసులకి మరియు త్వరితగతిన స్పందించి సకాలంలో ట్రీట్మెంట్ అందించి తనని ప్రమాదం నుంచి తప్పించిన డాక్టర్లకి కృతజ్ఞతలు తెలుపుతూ గోవింద ఎమోషనల్ అయ్యారు. అయితే గోవింద ఇంట్లో తుపాకీ ఎలా పేలిందనే విషయంపై పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా గోవిందని విచారించగా.. అక్టోబర్ 1న ఉదయం 4:30 గంటల సమయంలో కోల్‌కతాకు బయలుదేరే సమయంలో తన లైసెన్స్‌డ్ తుపాకీ తనిఖీ చేస్తున్నప్పుడు చేజారి ఈ సంఘటన జరిగినట్లు గోవింద పోలీసుల విచారణలో తెలిపారు. (Actor Govinda Discharged From Hospital)
Also Read- Prakash Raj: పవన్ కళ్యాణ్‌పై మరో ట్వీట్ పేల్చిన ప్రకాశ్ రాజ్..
అసలేం జరిగిందంటే..
అక్టోబర్ 1, మంగళవారం ఉదయం గోవిందా తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను తనీఖీ చేసే సమయంలో అది చేయి నుంచి జారి కిందపడటంతో మిస్‌ఫైర్ అయింది. ఈ మిస్‌ఫైర్‌లో ఆయన కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ వెంటనే అలెర్ట్ అయిన కుటుంబసభ్యులు గోవిందాను ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందించి కాలిలోని బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఈ ప్రమాదం నుంచి కోలుకున్న గోవిందాకు డాక్టర్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని, ఫుడ్ విషయంలోనూ తగిన డైట్ ఫాలో కావాలని సూచించినట్లుగా ఆయన సతీమణి సునీత తెలిపారు.