Abhishek Bachchan: ఐశ్వర్యకు కృతజ్ఞతలు.. తను లేకపోతే.. 

ABN, Publish Date - Nov 25 , 2024 | 02:11 PM

‘‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేయగలుగుతున్నానంటే అది నిజంగానే నా అదృష్టం. మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలు చూసుకుంటూ ఐశ్వర్య ఇంట్లోనే ఉంటుంది. ఆ విషయంలో తనకు కృతజ్ఞతలు చెబుతున్నా


బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan) తన సతీమణి ఐశ్వర్యారాయ్‌ను(Aishwarya Rai) ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీ విషయంలో తను ఎంతగానో సపోర్ట్‌ చేస్తుందని అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేయగలుగుతున్నానంటే అది నిజంగానే నా అదృష్టం. మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలు చూసుకుంటూ ఐశ్వర్య ఇంట్లోనే ఉంటుంది. ఆ విషయంలో తనకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఇప్పుడున్న రోజుల్లో ఈ విషయం పిల్లలకు కూడా అర్థమవుతోంది. వారు కూడా తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు. కుటుంబం విషయంలో ఐశ్వర్య సపోర్ట్‌ చేయడం వల్లే నేను సినిమాలపై పూర్తిగా దృష్టిపెట్టగలుగుతున్నా’’ అని అన్నారు. అనంతరం ఆయన తన తల్లిదండ్రుల గురించి మాట్లాడారు. ‘‘నేను పుట్టిన వెంటనే మా అమ్మ (జయా బచ్చన్‌) సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు. భర్త, పిల్లలు కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఆమె అనుకున్నారు. అందుకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నారట. నాన్న సినిమాలతో బిజీగా ఉన్నా.. వాళ్లిద్దరూ మాకు లోటు తెలియనివ్వలేదు. నా చిన్నతనంలో వరుస సినిమాలతో నాన్న ఖాళీ లేకుండా ఉండేవారు. నేను పడుకునే సమయానికి ఆయన ఇంటికి వచ్చేవారు. నిద్ర లేచేటప్పటికి సెట్‌కు వెళ్లిపోయేవారు. కాకపోతే, ఏ సమయంలో ఇంటికి వచ్చినా సరే.. నా గదిలోకి వచ్చి నన్ను చూసి వెళ్లేవారు. ఎన్ని వర్క్స్‌ ఉన్నా.. స్కూల్‌లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు నాన్న హాజరయ్యేవారు. నా బాస్కెట్‌ బాల్‌ పోటీలకూ వచ్చి ప్రోత్సహించేవారు. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు స్ఫూర్తిని ఇవ్వాలి. అలాగే వారి నుంచి మనం ప్రేరణ పొందాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు అందరిపైనా నాకు అమితమైన గౌరవం ఉంది. తల్లి నిర్వర్తించిన అన్ని బాధ్యతలు మరెవరూ చేయలేరు. తండ్రికి కూడా ఎంతో ప్రేమ, బాధ్యలు ఉంటాయి. కానీ వాటిని పైకి చూపించడు. వయసు పెరిగేకొద్దీ పిల్లలకు తండ్రి ప్రేమ అర్థమవుతుంది’’ అని అభిషేక్‌ బచ్చన్‌ అన్నారు.

 అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌ 2007లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం ఐశ్వర్య సినిమాల్లో వర్క్‌ చేశారు. 2011లో ఈ దంపతులకు ఆరాధ్య జన్మించింది. ఇటీవల అభిషేక్‌, ఐశ్వర్యల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిషేక్‌ చేసిన తాజా కామెంట్స్‌తో ఆ కథనాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు అయింది. తాజాగా అబిషేక్‌ నటించిన చిత్రం ‘ఐ వాంట్‌ టు టాక్‌’. సూజిత్‌ సర్కార్‌ తెరకెక్కించారు.  

Updated Date - Nov 25 , 2024 | 02:12 PM