Aishwarya Rai: ఐశ్వర్య, ఆరాధ్య ఓకే.. అభిషేక్ ఎక్కడ?

ABN, Publish Date - Oct 24 , 2024 | 04:27 PM

తాజాగా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి ఒక ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు. కానీ.. అభిషేక్ మిస్ అయ్యాడు. దీంతో నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్య రాయ్ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఐశ్వర్యతో పాటు తన కూతురు ఆరాధ్య కూడా న్యూస్ లో కనిపిస్తోంది. అయితే.. ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకోనుంది అనే రూమర్స్ వీరు ఎక్కడికెళ్లినా వార్తల్లోకి ఎక్కేలా చేస్తోంది. తాజాగా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి ఒక ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు. కానీ.. అభిషేక్ మిస్ అయ్యాడు. దీంతో నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.


తాజాగా ఐశ్వర్య రాయ్ తన కజిన్ బర్త్ డేకి కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్ళింది. అక్కడ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో తన తల్లి బృందా రాయ్, ఇతర సభ్యుల సింపుల్ లివింగ్ చూసి నెటిజన్లు షాక్ అవుతూ.. కాంప్లిమెంట్ చేస్తున్నారు. మరోవైపు అభిషేక్ ఈ ఈవెంట్ కి ఎందుకు హాజరు కాలేదంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే హౌస్ ఫుల్ 5 సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని అభిషేక్ లండన్ నుండి తిరిగి వచ్చిన ఇంకా రెస్ట్ మోడ్ లోనే ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ప్రతిదీ విడాకులకు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదంటూ మరికొందరు మండిపడుతున్నారు.


కొన్ని నెలల క్రితం ఐశ్వర్య తన భర్తకి బర్త్ డే విషెస్ లేట్ గా చెప్పడంతో విడాకుల రూమర్స్ పుట్టాయి. అయితే ఆరాధ్య స్కూల్ ఈవెంట్, అమితాబ్ బర్త్ డే సందర్భంగా ఐశ్వర్య ఈ వార్తలను పరోక్షంగా కొట్టిపడేసిన.. ఈ వార్తలకు ఇంకా చెక్ పడినట్లు కనిపించడం లేదు.

Updated Date - Oct 24 , 2024 | 04:27 PM