Abhishek Bachchan: ఆ పద్దతి మనిషి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది
ABN, Publish Date - Nov 24 , 2024 | 08:17 PM
హిందీలో ఒక సూక్తి ఉంటుంది. విషయం ఏదైనా సరే.. నువ్వు ఆచరించేది మంచి అయినప్పుడు దాన్ని ఎప్పటికీ వదలకూడదు. ప్రాథమిక విలువలు మార్చుకోకూడదు
అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)తాజాగా నటించిన చిత్రం ‘ఐ వాంట్ టు టాక్’ (i want to Talk). ప్రస్తుతం ఆయన ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నెగటివిటీపై అభిషేక్ మాట్లాడారు. ‘‘హిందీలో ఒక సూక్తి ఉంటుంది. విషయం ఏదైనా సరే.. నువ్వు ఆచరించేది మంచి అయినప్పుడు దాన్ని ఎప్పటికీ వదలకూడదు. ప్రాథమిక విలువలు మార్చుకోకూడదు. అన్నింటి నుంచి అభివృద్థి చెందుతూ ముందుకు సాగాలి. ఇదే నేను నమ్ముతా. నెగటివిటీని చూసి మారను. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉండాలనుకుంటా. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటివి సర్వసాధారణం. సమస్య ఎంత పెద్దది అయినా.. ఆశతో ముందుకు అడుగు వేయండి. అలా కాకుండా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి దూరం వెళ్లిపోతే.. అది కూడా తప్పు అంటారు. విమర్శలను నేను పట్టించుకోను. మనిషి ఎదుగుదలకు అది అడ్డంకిగా మారుతుందన్నారు’’ అని అన్నారు.
గతంలో అమితాబ్ బచ్చన్ ((Amithab Bachchan)కూడా పరోక్షంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ‘‘నా కుటుంబం గురించి నేను అరుదుగా మాట్లాడుతుంటా. ఎందుకంటే అది నా సామ్రాజ్యం. దాని గోపత్యను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అసత్య ప్రచారాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పూర్తి సమాచారం తెలుసుకోకుండా అవాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుంటారు. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అది నిజమైన వృత్తి ధర్మం’’ అని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రాన్ని సూజిత్ సర్కార్ తెరకెక్కించారు. అర్జున్ అనే ఎన్నారై పాత్రలో అబి?షేక్ నటించారు. జీవితాన్ని మార్చే ఒక శస్త్ర చికిత్స చేయించుకోవడానికి తనను తాను సిద్థం చేసుకునే ఓ వ్యక్తి కథ ఆధారంగా రూపొందిన చిత్రమిది.