Aamir Khan: వరుడు ఎవరు? వివాహ వేదికకు ఎలా వచ్చాడంటే!
ABN, Publish Date - Jan 04 , 2024 | 12:35 PM
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్(Amir khan), రీనా దత్త (Reena Dutta) కుమార్తె ఐరా ఖాన్(Ira khan) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో తన ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను (Nupur Shikare) వివాహమాడారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్(Aamir Khan), రీనా దత్త (Reena Dutta) కుమార్తె ఐరా ఖాన్(Ira khan) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో తన ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను (Nupur Shikare) వివాహమాడారు. ముంబయిలోని ఓ హోటల్ ఈ వివాహానికి వేదికైంది. రిజిస్టర్ మ్యారేజీతో ఐరా-నుపుర్ ఒక్కటయ్యారు. ఆమిర్‌ఖాన్, తన మాజీ భార్యలు రీనా దత్త, కిరణ్ రావు, ముకేశ్ - నీతా అంబానీ దంపతులు తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. అనంతర రిసెప్షన్ జరిగింది.
ఆమిర్ ఖాన్- రీనా దత్త కూతురుగా ఐరా ఖాన్ సినీ ప్రియులకు సుపరిచితమే. గత కొన్నేళ్లుగా ఆమిర్ ఖాన్‌కు నుపుర్ వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. దీంతో ఐరా సైతం నుపుర్ వద్ద ఫిట్నెస్ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2022 నవంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లికి ముందు నుపుర్ తన నివాసం నుంచి జాగింగ్ చేస్తూ హోటల్‌కు చేరుకున్నారు. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను వివాహం చేసుకున్నారు. దాదాపు 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వచ్చిన అతడు దుస్తులు మార్చుకోకుండా జాగింగ్ డ్రెస్ లోనే పెళ్లి తంతులో పాల్గొన్నాడు. రిసెప్షన్‌కు మాత్రం కొత్త బట్టల్లో దర్శనమిచ్చాడు. పెళ్లి వేడుకలో ఆమిర్ ఖాన్ ఇద్దరు మాజీ భార్యల హాడావిడి హైలెట్‌గా నిలిచింది. రెండో మాజీ భార్య కిరణ్ రావుకు ఆప్యాయంగా నుదుటన ముద్దు పెడుతూ ఫోటోలకు పోజిచ్చాడు ఆమిర్. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ నెల 8న రాజస్థాన్ లోని ఉదయ్పుర్లో ఈ జంట మరోసారి వివాహ వేడుక జరుపుకోనుంది. జనవరి 13న ముంబయిలో వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు.