Aamir Khan: ఆ హీరోలు బావుంటారు.. నన్ను హేళన చేసేవారు!
ABN, Publish Date - Aug 19 , 2024 | 08:43 PM
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty)ప్రారంభించిన ‘చాప్టర్2’ పాడ్‌కాస్ట్‌కు అగ్ర నటుడు ఆమిర్‌ఖాన్ (Aamir khan) అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికగా ఆసక్తికర విషయాలు చెప్పారు.
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty)ప్రారంభించిన ‘చాప్టర్2’ పాడ్‌కాస్ట్‌కు అగ్ర నటుడు ఆమిర్‌ఖాన్ (Aamir khan) అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికగా ఆసక్తికర విషయాలు చెప్పారు. స్టార్ డమ్ , సినిమాలు, క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదర్కొన్నారు అన్న విషయాలపై మాట్లాడారు. ‘హృతిక్ రోషన్, సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్ చూడటానికి బాగుంటారు. కానీ, మరి నా పరిస్థితి. చాలా మంది నా వేషధారణ చూసి హేళనగా మాట్లాడేవారు. సినిమాలు మానేద్దామనుకున్నా’ అని ఆమిర్ అన్నారు. ఆమిర్ ఈ మాట అనగానే ‘మీరు అబద్థం చెబుతున్నారు’ అని రియా స్పందించింది. కావాలంటే లైడిటెక్టర్ పరీక్ష పెడతానని అనడంతో నవ్వులు పూశాయి. సినిమాలు ఎందుకు చేయకూడదనుకున్నారు? అందుకు కారణాలు ఏంటి? తెలియాలంటే ఆగస్టు 23న స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్‌ను చూడాల్సిందే. అంతేకాదు, ఈ సందర్భంగా రియా చక్రవర్తి పైనా ఆమిర్ ప్రశంసలు కురిపించారు. ఆమె జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొందని అన్నారు. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితేసన్‌తో ఈ ఏడాది జులైలో ‘చాప్టర్2’ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించింది రియా చక్రవర్తి.