కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Allu Arjun: ‘పుష్ప’ తో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించనున్నాడా? నేషనల్ అవార్డు కోసం అభిమానుల ప్రార్థనలు

ABN, First Publish Date - 2023-08-24T15:35:03+05:30

ఈసారి జాతీయ ఫిలిం అవార్డులకు అల్లు అర్జున్ ఎంపికయ్యినట్టుగా గట్టిగా వినపడుతోంది. ఒకవేళ అదే నిజమైతే జాతీయ అవార్డు గెలుచుకున్న మొదటి తెలుగు నటుడు అల్లు అర్జున్ అవుతాడు. అతని అభిమానులు అయితే గట్టిగానే ప్రార్ధనలు చేస్తున్నారు.

Allu Arjun from Pushpa

69వ జాతీయ సినిమా అవార్డులు ఎవరెవరికి ఇస్తున్నారో ఇంకొన్ని గంటల్లో బయటకు రాబోతున్నాయి. జ్యూరీ ఈరోజు సాయంత్రం అయిదు గంటలకి ఢిల్లీ లో జాతీయ అవార్డులు ప్రకటించనున్నారు. అయితే ఈసారి అవార్డుల విజేతల్లో గట్టి పోటీ ఉందని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే చాలా మంచి సినిమాలు గత సంవత్సరం విడుదలయ్యేయి, అందులో అల్లు అర్జున్ (AlluArjun) నటించిన తెలుగు సినిమా 'పుష్ప' #Pushpa కూడా వుంది. ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ (Sukumar).

ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన తన కెరీర్ లో బెస్ట్ ఇచ్చాడని అందరూ ప్రశంసించారు. ఆ సినిమా తెలుగు సినిమా జయపతాకాన్ని ప్రపంచం అంతటా చాటి చెప్పింది. అందులో అల్లు అర్జున్ అన్న ఒక మాట 'తగ్గేదే లే' అనేది ప్రపంచం లో ఎంతోమంది సెలబ్రిటీస్, అలాగే క్రికెట్ మ్యాచ్ లో ఆడే క్రికెటర్లు సైతం ఆ ఊతపదాన్ని వాడారు అంటే ఆ సినిమా ప్రభావం ఎంత వుంది అనేది అందరికీ అర్థం అవుతుంది. #NationalFilmAwards

ఇక అందులో నటించిన అల్లు అర్జున్ ఈసారి జాతీయ ఉత్తమ నటుడుకి ఎంపికయ్యే సూచనలు వున్నాయి అని అనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ వేపే చాలామంది మొగ్గు చూపినట్టుగా కూడా తెలిసింది. ఒకవేళ అల్లు అర్జున్ కానక జాతీయ అవార్డు వస్తే అతను చరిత్ర సృష్టించినట్టే. ఎందుకంటే ఇంతవరకు ఒక్క తెలుగు నటుడికి జాతీయ అవార్డు రాలేదు. తెలుగు సినిమాలో నటించిన ఇతర బాషా నటులు కమల్ హాసన్ లాంటివాళ్ళకి వచ్చింది కానీ, తెలుగు నటుడికి మాత్రం ఇంతవరకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాలేదు. ఈసారి అల్లు అర్జున్ కి వస్తుంది అని అతని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు, అతనికి వస్తే తెలుగు ప్రజలందరూ సంబరాలు చేసుకునే సమయం ఆసన్నమైనట్టే !

Updated Date - 2023-08-24T15:50:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!