కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vishwak Sen: జీవితంలో మరో కొత్త దశలోకి.. పబ్లిసిటీ స్టంటా లేక నిజంగానే పెళ్లా..?

ABN, First Publish Date - 2023-08-14T10:26:55+05:30

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలతో విశ్వక్‌సేన్ దారి వేరు. హీరోగా తనకంటూ సొంత గుర్తింపును.. తనే సొంతంగా సంపాదించుకున్న విశ్వక్‌సేన్.. తాజాగా చేసిన ఓ ప్రకటనతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. ఈ ప్రకటన ప్రకారం ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తున్నా.. గతంలో ఆయన స్టంట్స్ చూసిన వారంతా.. ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ ఏమో అనేలా అనుకుంటున్నారు.

Hero Vishwak Sen

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలతో విశ్వక్‌సేన్ (Vishwak Sen) దారి వేరు. హీరోగా తనకంటూ సొంత గుర్తింపును.. తనే సొంతంగా సంపాదించుకున్న విశ్వక్‌సేన్.. అన్ని రకాల సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆయన సినిమాలు విడుదలకు సిద్ధమైన సమయంలో.. చేసే పబ్లిసిటీనే కాస్త తేడా ఉంటుంది. ప్రస్తుతం ఆయన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కృష్ణచైతన్య దర్శకత్వం‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్‌ కాగా.. తెలుగమ్మాయ్ అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. మరి ఈ సినిమా పబ్లిసిటీ కోసం చేశాడో.. లేదంటే నిజంగా పెళ్లి చేసుకోబోతున్నాడో తెలియదు కానీ.. తాజాగా విశ్వక్‌సేన్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేసిన ప్రకటన హాట్ టాపిక్ అవుతోంది. (Vishwak Sen Announcement)


‘‘నా అభిమానులు, శ్రేయోభిలాషులకు నేను తెలియజెప్పేది ఏమిటంటే.. ఇన్నాళ్లుగా నాపై మీరు కురిపించిన ప్రేమ, మద్దతుకు సర్వదా కృతజ్ఞుడిని. ఇప్పుడు జీవితంలో మరో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలియజేసేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను ఫ్యామిలీ మొదలెట్టబోతున్నాను. వివరాలు త్వరలోనే’’ అని తెలుపుతూ.. ఆగస్ట్ 15న రివీల్ చేస్తానని విశ్వక్ సేన్.. ఈ ప్రకటనలో తెలియజేశారు. అయితే నిజంగానే పెళ్లి చేసుకుంటే.. ఆయన చెప్పినట్లుగా ఆయనే కాదు.. ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషిస్తారు. కానీ ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ అయితే మాత్రం.. జీవితంలో మళ్లీ విశ్వక్‌సేన్‌ని ఆయన అభిమానులు కూడా నమ్మరు. (Tollywood Hero Vishwak Sen)

విశ్వక్‌సేన్ చేసిన ఈ ప్రకటనకి నెటిజన్లు కూడా ఇలాగే రియాక్ట్ అవుతున్నారు. ‘అన్నా.. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు కదా..’ అని, ‘ఇంతకీ పెళ్లి ఎప్పుడు? పెళ్లి కూతురు ఎవరు?’, ‘ఏమో అన్నా.. నువ్వు మూడు ముళ్లు వేసి.. పెళ్లి అయిందని చెప్పే వరకు మేము నమ్మేలేం’.. ఇలా రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ సంగతి అటుంచితే.. అసలు ఆగస్ట్ 15న విశ్వక్‌సేన్ ఏం చెప్పబోతున్నాడనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఆసక్తికి తెరపడాలంటే.. విశ్వక్ నుంచి అసలు ప్రకటన రావాల్సిందే. అంత వరకు వెయిట్ అండ్ సీ..


ఇవి కూడా చదవండి:

***************************************

*Renu Desai: రేణు దేశాయ్ విజ్ఞప్తిపై అంబటి రియాక్షన్.. ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లే!

***************************************

*SS Rajamouli: అందుకే యూత్‌కు న‌చ్చుతుంది

***************************************

*Vishal Marriage: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలపై విశాల్ క్లారిటీ..

***************************************

Updated Date - 2023-08-14T10:26:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!