సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijayashanthi: ఆ హక్కు ఎవరికుంది?.. ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌పై సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-05-10T14:38:50+05:30

ప్రభుత్వాలనే ఎన్నకునే ప్రజలకి.. ఏ సినిమా చూడాలో.. ఏ సినిమా చూడకూడదో.. అనే విజ్ఞత లేదని అనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో రాములమ్మ ఓ పోస్ట్ చేశారు. అందులో..

Vijayashanthi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెన్సార్‌షిప్ పూర్తి చేసుకున్న ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లని కోర్టులు సైతం పక్కన పెట్టినప్పుడు.. ఆ సినిమాని ప్రజలకి దూరం చేసే హక్కు ఎవరికుంది? అని ప్రశ్నించారు నటి, బీజేపీ నేత విజయశాంతి (Vijayashanthi). శాంతి భద్రతల పేరు చెప్పి.. ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనని అడ్డుకుంటున్న ప్రభుత్వాలపై ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వాలనే ఎన్నకునే ప్రజలకి.. ఏ సినిమా చూడాలో.. ఏ సినిమా చూడకూడదో.. అనే విజ్ఞత లేదని అనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో ఆమె ఓ సుధీర్ఘ పోస్ట్‌ చేశారు. విజయశాంతి తన పోస్ట్‌లో ఏం రాసుకొచ్చారంటే.. (Vijayashanthi Post on The Kerala Story Movie)

‘‘ది కేరళ స్టోరీ సినిమాపై కొనసాగుతున్న చర్చలు, వాదవివాదాలు, నిరసనలను గమనిస్తుంటే ఒక విషయం బాగా అర్థమవుతోంది. ఏ సినిమా అయినప్పటికీ, దానిని చూడాలా వద్దా?... అందులోని అంశాలు నిజమా, కాదా? అనేది ప్రజలు తమ విజ్ఞతతో తెలుసుకోవాల్సిన విషయం కాగా.... ప్రజలకు ఉన్న ఆ విజ్ఞతని కొన్ని వర్గాలు, చివరికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ చేతుల్లోకి లాక్కోవడం దురదృష్టకరం. సెన్సార్‌షిప్ పూర్తి చేసుకున్న ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లని కోర్టులు సైతం పక్కన పెట్టినప్పుడు ఆ సినిమాని ప్రజలకి దూరం చేసే హక్కు ఎవరికుంది? మనది ప్రజాస్వామిక దేశం... జనం తమ విజ్ఞతతో ప్రభుత్వాలనే ఎన్నుకుంటున్న రోజుల్లో ఒక సినిమాని చూసి, అందులో ఏ అంశాల్ని స్వీకరించాలో... వేటిని తిరస్కరించాలో ప్రజలకి తెలియదని అనుకుంటున్నారా? చివరికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆ వర్గాలకి భయపడి సినిమా ప్రదర్శనకు ఆటంకాలు సృష్టించడం దారుణం.

గతంలో ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) సినిమా విషయంలోనూ ఇలాగే కొన్ని వర్గాలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. సినిమా ప్రదర్శనని ఆపగలరేమో... కానీ అందులోని సత్యం మాత్రం గుండెల్ని చీల్చుకుని మనసుల్లో నాటుకోవడం ఖాయమని గుర్తించండి. ఒక సినిమా చూస్తేనే శాంతిభద్రతలు చెయ్యి దాటిపోయే సమస్య ఆ నిషేధించిన 3 రాష్ట్రాలలో ఉండి... మిగతా దేశంలోని 27 రాష్ట్రాలకు ఆ పరిస్థితి లేదంటే అది ఆ నిషేధించిన రాష్ట్రాల పాలనా వైఫల్యం అయితదా?... లేక మెజారిటీ ప్రజల మనోభావాలను గుర్తించని మరో విధానం అయితదా?... వారికే తెలియాలి..’’ అని రాములమ్మ (Ramulamma) ప్రశ్నాస్త్రాలు సంధించారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Vasuki Anand: పవన్ కల్యాణ్ సోదరి అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది

*VD12: విజయ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రత్యేక పోస్టర్.. ఫ్యాన్స్ ఖుష్

*Kushi: సినిమా పేర్లతో విజయ్ దేవరకొండ, సమంత పాటేసుకున్నారు.. పాట ఎలా ఉందంటే..

*PKSDT: టైటిల్ ఫిక్సయిందా.. ‘దేవుడే దిగివచ్చినా’ కాదా?

*Tamanna: పొంగల్‌కి శృతిహాసన్.. ఇండిపెండెన్స్ డేకి తమన్నా..

*The Kerala Story: మరో స్టేట్‌లో నిషేధం.. షాక్‌లో చిత్రయూనిట్

Updated Date - 2023-05-10T16:35:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!