Vijay Deverakonda: చిరంజీవి, రజినీకాంత్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ
ABN, First Publish Date - 2023-08-22T11:19:05+05:30
తన 'ఖుషీ' సినిమా ప్రచారంలో భాగంగా ఆ సినిమా కథానాయకుడు విజయ్ దేవరుకొండ తెలుగులోనే కాకుండా మిగతా ప్రాంతాలు కూడా తిరుగుతున్నాడు. ఆలా వెళ్ళినప్పుడు తాజాగా అతను చిరంజీవి, రజినీకాంత్ ల మీద చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
చిరంజీవి (Chiranjeevi), రజినీకాంత్ (Rajinikanth) ఇద్దరూ సూపర్ స్టార్స్, వాళ్ళకి జయం, అపజయం అనేది మామూలు పదం అని, ఎందుకంటే వాళ్ళు ఈ రెండింటికన్నా ఇంకా ఎక్కువ అని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (VijayDeverakonda) అన్నాడు. చిరంజీవి తాజా సినిమా 'భోళా శంకర్' #BholaaShankar సరిగ్గా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేకపోవడంతో సాంఘీక మాధ్యమాల్లో చిరంజీవి మీద విరుచుకు పడ్డారు. వీటన్నిటికీ విజయ్ దేవరకొండ తనదైన స్టయిల్ లో సమాధానాలు చెప్పాడు.
చిరంజీవి, రజినీకాంత్ లాంటివాళ్ళకి ఇలాంటి అపజయాలు వరసగా ఆరేడు వచ్చినా వాళ్ళు మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర తమ ప్రతాపం చూపిస్తారని చెప్పాడు. వాళ్ళకి ఇవేమీ కొత్త కావు. రజినీకాంత్ వరసగా ఆరు ప్లాప్ లు ఇచ్చినా, 'జైలర్' #Jailer అనే సినిమాతో ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.500 కోట్లు కలెక్టు చేసే హిట్ ఇచ్చారని, అందుకని వాళ్ళకి హిట్, ఫ్లాప్ ఇలాంటివి ఏవీ ఉండవని అన్నాడు విజయ్.
చిరంజీవి గురించి మాట్లాడుతూ ఒక మంచి దర్శకుడు పడితే అతనిలో వున్న ఎనర్జీ ని బయటకి తీసుకువచ్చి అతని చేత చేయిపిస్తే మొన్న సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర 'వాల్తేరు వీరయ్య' #WaltairVeerayya లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారని చెప్పాడు. అసలు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొనివాళ్లు కొన్ని వేలమంది ఉంటారని చెప్పాడు విజయ్. "చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చారు. అప్పటివరకు వుండే డాన్సులు చిరంజీవి వచ్చాక మారాయి, అలాగే పోరాట సన్నివేశాలు, పాటలు ఒకటేమిటి ఎన్నో ఇలా చిరంజీవి తనడైన స్టయిల్ లో మార్పులు చేశారు. చిరంజీవి వచ్చిన తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకోలా ఉందని, అంతలా ప్రభావం చూపించారు చిరంజీవి," అంటూ విజయ్ దేవరకొండ చిరంజీవి గురించి చెప్పుకొచ్చారు.
ఏమైనా విజయ్ అన్నది కరెక్టు. చిరంజీవికి గెలుపోటములు కొత్తకాదు. అతను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి ఈరోజు ఒక మెగాస్టార్ స్థాయికి చేరారు అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, డెడికేషన్ చేసే అతని పని ఈరోజు అతన్ని ఈస్థాయికి తీసుకు వచ్చాయి. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అతనికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అలాగే హిట్ వచ్చినా అతనేమీ పొంగిపోయి ఉర్రూతలూగరు. ఎందుకంటే అతను అన్నీ చూసేసారు, అవన్నీ అతనికి మామూలే. అందుకే అతను మెగా స్టార్, విజయ్ దేవరకొండ చెప్పింది కరెక్టు, చిరంజీవి అంటేనే స్ఫూర్తి, ఒక మహా వృక్షం. ఆ మహా వృక్షం కిందా ఎంతమందో రక్షణ పొందుతున్నారు.