Vijay Antony: ‘నా కూతురి చావుతోనే, నేనూ చనిపోయా’.. కన్నీళ్లు పెట్టిస్తోన్న విజయ్ ఆంటోని లేఖ
ABN, First Publish Date - 2023-09-21T22:08:29+05:30
కోలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోనీ.. తన పెద్ద కుమార్తె (16) మృతిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రీసెంట్‌గా విజయ్ పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎంతో ప్రేమగా చూసుకునే తన కుమార్తె చావుతోనే.. తను కూడా చనిపోయానని తెలుపుతూ.. తాజాగా ఆయన ఓ లేఖను విడుదల చేశారు.
కోలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోనీ.. తన పెద్ద కుమార్తె (16) మృతిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రీసెంట్‌గా విజయ్ పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మరణాన్ని విజయ్ ఆంటోని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ప్రేమగా చూసుకునే తన కుమార్తె చావుతోనే.. తను కూడా చనిపోయానని తెలుపుతూ.. తాజాగా ఆయన ఓ లేఖను విడుదల చేశారు.
‘‘నా పెద్ద కుమార్తె గొప్ప హృదయం గల మనిషి. అంతకుమించి ధైర్యవంతురాలు. ప్రస్తుతం తను కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణంలేని ప్రశాంతమైన చోటుకి వెళ్లిపోయింది. అయినా ఆమె ఇప్పటికీ నాతోనే ఉన్నట్లుంది. తను చనిపోయినప్పుడే.. తనతో పాటూ నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ఆరంభిస్తాను’’ అని విజయ్ ఆంటోనీ ఓ ఎమోషనల్ లేఖను ట్వీట్ చేశారు. ఈ లేఖ చూసిన వారంతా.. కన్నీటి పర్యంతమవుతున్నారు. (Vijay Antony Letter)
చేతికి ఎదిగి వచ్చిన బిడ్డ చనిపోతే.. ఏ తండ్రికి అయినా ఇలానే ఉంటుంది. విజయ్ ఆంటోని ఎంత బాధపడుతున్నారనేది ఆయన లేఖను చూస్తుంటే తెలుస్తుంది. ఈ లేఖను చూసిన వారంతా.. ఆయనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ.. విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున ఇంట్లో వాళ్లు చూసి.. వెంటనే హాస్పిటల్కు తరలించినా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు.
ఇవి కూడా చదవండి:
============================
*Cable Reddy: ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ చూశారా..
*******************************
*Naveen Polishetty: సీన్ పేపర్‌లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు
******************************
*Natti Kumar: అసెంబ్లీలో బాలకృష్ణపై అంబటి వ్యాఖ్యలను ఖండిస్తున్నా..
********************************
*Anasuya: ‘పెదకాపు 1’లో కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పా..
*******************************