Trivikram Srinivas: పబ్లిగ్గా హీరోయిన్‌కి ‘లవ్ యు’ చెప్పేసిన మాటల మాంత్రికుడు
ABN, First Publish Date - 2023-02-16T19:43:10+05:30
మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas).. ఓ హీరోయిన్ నటనను మెచ్చి.. పబ్లిగ్గా ‘లవ్ యు’ అని చెప్పేశారు. ఈ ఘటనకు ‘సార్’ (Sir) ప్రీ రిలీజ్ వేడుక
మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas).. ఓ హీరోయిన్ నటనను మెచ్చి.. పబ్లిగ్గా ‘లవ్ యు’ అని చెప్పేశారు. ఈ ఘటనకు ‘సార్’ (Sir) ప్రీ రిలీజ్ వేడుక వేదికైంది. ఇంతకీ త్రివిక్రమ్ ‘లవ్ యు’ (Love You) అని చెప్పిన హీరోయిన్ ఎవరనుకుంటున్నారు? ‘సార్’ సినిమాలో హీరోయిన్గా నటించిన సంయుక్తా మీనన్ (Samyuktha Menon). ఇంతకు ముందు సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) వాళ్లే నిర్మించిన ‘భీమ్లా నాయక్’ చిత్రంలో డానియల్ శేఖర్‌గా నటించిన రానా దగ్గుబాటి (Rana Daggubati) భార్యగా ఆమె నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు ఫిదా అయిన మేకర్స్.. వెంటనే తమ తదుపరి ప్రాజెక్ట్ అయిన ‘సార్’ చిత్రంలోనూ సంయుక్తా మీనన్‌కు అవకాశం ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక (Sir Pre Release Event)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో హీరోయిన్ సంయుక్తా మీనన్ గురించి ఆయన మాట్లాడుతూ.. సంయుక్తా.. థ్యాంక్యూ అండ్ లవ్ యు. నువ్వు అడిగావని నా వైఫ్‌కి చెబుతాను. నా వైఫ్ ఈ సినిమాకి నిర్మాతగా పని చేశారు. ఇంటి దగ్గర వేరే పనిలో ఆమె బిజీగా ఉండటంతో ఆమె ఈ వేడుకకు రాలేకపోయారు. ఈ వేడుకకు వచ్చిన వారందరి శుభాకాంక్షలను నేను ఆమెకి తెలియజేస్తాను. అందరూ ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్లలో చూడండి. ధనుష్ (Dhanush)కు తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున గ్రాండ్‌గా వెల్కమ్ చెబుదాం. ఆయనకు మన ప్రేమను తెలియజేద్దాం. ప్రేమ వర్షం కురిపించి.. ‘సార్’ని మన భుజాలపైకి ఎత్తుకుందాం. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
అయితే సినిమా గురించి త్రివిక్రమ్ చాలా చెప్పినప్పటికీ.. అదంతా వదిలేసి, కేవలం హీరోయిన్ సంయుక్తా మీనన్‌కు ‘లవ్ యు’ అని చెప్పిన వీడియో బైట్‌ని మాత్రమే నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. సినిమా యూనిట్ కూడా ఈ సినిమాలో సంయుక్తా (Samyuktha) నటనకు అందరూ ఫిదా అవుతారని చెబుతున్నారు. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంత గొప్ప రచయిత, దర్శకుడి చేతే ‘లవ్ యు’ చెప్పించుకున్న ఆమె నటన.. ఈ సినిమాలో ఎలా ఉండబోతోందో తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. (Trivikram Srinivas and Samyuktha Menon)