కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bholaa Shankar: రజనీ మేనియా చిరంజీవి సినిమా మీద ఉంటుందా ?

ABN, First Publish Date - 2023-08-10T17:27:20+05:30

రెండు పెద్ద సినిమాలు, అదీ ఇద్దరు అగ్ర నటులు రజినీకాంత్, చిరంజీవి సినిమాలు ఒకరోజు తేడాలో విడుదలవుతున్నాయి. రజినీకాంత్ సినిమా హిట్ టాక్ వచ్చింది, మరి రేపు విడుదలవబోతున్న చిరంజీవి సినిమా మీద ఈ రజిని హిట్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది

Rajinikanth and Tamannaah from Jailer film

ఈరోజు రజనీకాంత్ #Rajinikanth నటించిన 'జైలర్' #Jailer సినిమా విడుదలైంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రజిని అభిమానులకు ఈరోజు పండగే పండగ. ఎందుకంటే నెల్సన్ (Nelson) దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో మొదటి ఆట నుండి వెళుతోంది. అప్పుడెప్పుడో 'రోబో' #Robo సినిమాతో హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్ళీ ఈ 'జైలర్' #Jailer ద్వారా హిట్ కొట్టబోతున్నాడు అనే టాక్ ప్రతి దగ్గరా వినబడుతోంది. రజినీకాంత్ కి ప్రపంచం అంతటా అభిమానులు వున్నారు.

అయితే ఇప్పుడు పరిశ్రమలో వినిపిస్తున్న మాట ఏంటంటే రజినీకాంత్ 'జైలర్' ఇప్పుడు హిట్ అయింది, మరి రేపు చిరంజీవి (MegaStarChiranjeevi) నటించిన 'భోళాశంకర్' #BholaaShankar విడుదలవుతోంది కదా, ఆ సినిమా మీద ఏమైనా ఈ రజిని మనియా ప్రభావం ఉంటుందా అని. ఎందుకంటే రజినీకాంత్ సినిమాలు కర్ణాటకలో (Karantaka) బాగా ఆడతాయి, అలాగే ఓవర్సీస్ కూడా బ్రహ్మాండంగా ఆడతాయి. అతనిది చాలా పెద్ద మార్కెట్ అని కూడా అంటూ వుంటారు. అతన్ని మ్యాచ్ చెయ్యడం ఎవరికైనా కష్టమే అని అంటూ వుంటారు.

మరి అలాంటప్పుడు ఈ 'భోళాశంకర్' కూడా రేపు విడుదలవుతోంది. అంటే ఒక్కరోజు తేడాలోనే రెండు పెద్ద పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. మరి రేపు 'భోళాశంకర్' టాక్ ఎలా ఉండబోతోందో, దర్శకుడు మెహెర్ రమేష్ (MeherRamesh), చిరంజీవిని ఏ విధంగా చూపించాడా అని మెగా అభిమానులు చాలా ఆతృతగా వున్నారని కూడా తెలుస్తోంది. చిరంజీవి సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడుతుంది. కానీ కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో రజిని మనియా విపరీతంగా వుంది, ఈరోజు రాత్రికి ప్రీ బుకింగ్ కలెక్షన్స్ చూస్తేనే మతిపోతోంది అక్కడ. మరి రేపు కూడా అలాగే ఉంటే, మరి చిరంజీవి సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ అక్కడ ఉంటాయి అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే పరిశ్రమలో ఒక చర్చ కూడా నడుస్తోంది. రెండు పెద్ద సినిమాలు ఒకరోజు తేడాలో విడుదల చేస్తే, రెండు సినిమాల రెవిన్యూ తగ్గే అవకాశాలు వున్నాయి కదా, మరీ నిర్మాతలు ముందే మాట్లాడుకొని ఒక వారం అయినా గ్యాప్ ఉండేట్టు విడుదల చెయ్యాల్సింది అని పరిశ్రమలో టాక్. అయితే ఇప్పుడు ఒకటి విడుదలైంది, రెండోది కూడా రేపు వచ్చేస్తోంది, ఇంకా దానికి ఆస్కారం లేదు, కానీ ముందు ముందు ఇలా రెండు పెద్ద సినిమాలు ఓవర్ లాప్ అవకుండా చూసుకొని ఉంటే పరిశ్రమకి బాగుంటుంది అని అంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలు.

Updated Date - 2023-08-10T18:17:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!