Jr NTR: నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పైకిలేపినందుకు వాళ్ళకి పాదాభివందనాలు
ABN, First Publish Date - 2023-09-16T10:16:49+05:30
జూనియర్ ఎన్టీఆర్ దుబాయిలో ఒక సినిమా వేడుకలో పాల్గొనేందుకు కుటుంబంతో వెళ్ళాడు. అక్కడ నిన్న రాత్రి 'ఆర్ఆర్ఆర్' లో తను చేసిన పాత్రకి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ వున్నాయి
తెలుగువాళ్లందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలమీదే వుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ChandrababuNaidu) అరెస్టు, ఆ తరువాత అతని అరెస్టును చలన చిత్ర పరిశ్రమ నుండి ఎక్కువమంది ముందుకు వచ్చి ఖండించలేదని విమర్శలు, వార్తలు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే వున్నాయి. నిర్మాత నట్టికుమార్ (NattiKumar) చలన చిత్ర పరిశ్రమ నుండి అందరూ ఈ అరెస్టును ఖండించాలని చెప్పాడు. అయితే ఇవన్నీ ఆలా ఉంచితే కుటుంబ సభ్యుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ (JrNTR) ఈ అరెస్టు గురించి ఎటువంటి వ్యాఖ్య చేయకపోవటం ఇంకో చర్చనీయాంశం అయింది.
ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు. దుబాయిలో (Dubai) జరుగుతున్న సినిమా అవార్డుల ఫంక్షన్ లో పాల్గొనటానికి ఎన్టీఆర్ (NTR) తన కుటుంబ సభ్యులతో వెళ్ళాడు. అక్కడ నిన్న రాత్రి 'ఆర్ఆర్ఆర్' #RRR సినిమాలో కొమరం భీమ్ పాత్రకి గాను ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు.
ఈ సందర్భంగా అక్కడ వేదిక మీద ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు, సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వున్నాయి. అతని తన అభిమానులను ఉద్దేశించి ఈ మాటలను అన్నాడు. వాళ్ళీ తనకి చేయూత అని, వాళ్ళే తనకి కష్టనష్టాల్లో తనతో పాటుగా వుంది, తనకి చేదోడు వాడాడు గా వున్నారని అందుకని వాళ్ళకి పాదాభివందనాలు అని చెప్పాడు.
"ఐ లవ్ మై ఫాన్స్. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు కూడా నవ్వినందుకు, నా అభిమాన సోదరులందరికీ తలవంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను", అని ఎన్టీఆర్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతూ వున్నాయి.