Salaar: ‘సూరీడే..’ పాట.. ‘సలార్’ స్ట్రెంత్ ఇది
ABN, First Publish Date - 2023-12-13T22:13:48+05:30
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో అందరూ ఆశ్చర్యపోయే ప్రొడక్షన్ వేల్యూస్‌తో సినిమాలను నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుండి ‘సూరీడే’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan India Star Prabhas) టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ (Salaar Part 1: CeaseFire). అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో అందరూ ఆశ్చర్యపోయే ప్రొడక్షన్ వేల్యూస్‌తో సినిమాలను నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ కిరంగదూర్ (Vijay Kiragandur) నిర్మాత. మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అనేంత రేంజ్‌లో అంచనాలను పెంచుకుంటోన్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రీసెంట్‌గా విడుదలైన ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సినిమాపై ఆకాశమే అవధి అనేలా అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు దీన్ని మరో మెట్టు పెంచేలా.. ‘సలార్’ స్ట్రెంత్ ఇదని చెప్పేలా.. సినిమా నుండి ‘సూరీడే..’ అనే లిరికల్ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు.
గూజ్ బమ్స్ తెప్పించే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న సలార్ సీజ్ ఫైర్‌లో సలార్ మ్యూజికల్ వరల్డ్‌లోకి అందరినీ తీసుకెళ్లారు. అందులో భాగంగా ‘సూరీడే..’ పాటను తొలి పాటగా విడుదల చేయటంపై ఫ్యాన్స్, ప్రేక్షకులు హ్యపీగా ఫీల్ అవుతున్నారు. ఈ పాట లిరిక్స్ వింటుంటే హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. ఇది సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని, ఒకే ఆత్మ అనేలా ఉండే ఇద్దరి స్నేహితులు గురించి ఈ పాట చెబుతుంది. వారే ఒకరికొకరు బలం.. వారే ఒకరికొకరు బలహీనత అని పాట తెలియజేస్తుంది. రవి బస్రూర్ సంగీత సారథ్యంలో హరిణి వైతూరి పాడిన ఈ సాంగ్‌ను కృష్ణకాంత్ రాశారు. (Soorede Lyrical Song From Salaar Out)
సలార్ సీజ్ ఫైర్ కేవలం యాక్షన్ సినిమాయే కాదు.. అంతకు మించిన ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని ఈ పాటతో ఆడియెన్స్‌కి క్లియర్‌గా అర్థమవుతోంది. సలార్ సీజ్ ఫైర్ సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 55 నిమిషాల వ్యవధితో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. డిసెంబర్ 22న హోంబలే సంస్థ ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. క్రిస్మస్ సీజన్‌లో సలార్ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Mass Combo: మ్యాజికల్ మాస్ కాంబో ఈజ్ బ్యాక్.. కాకపోతే ఇవే డౌట్స్!
*****************************************
*Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రెండో గీతం ఎలా ఉందంటే..
*****************************************
*Viraj Ashwin: హీరోగానే కంటిన్యూ చేస్తా.. ఏదైనా పవర్‌ఫుల్ పాత్ర అయితే మాత్రం..?
*******************************
*Srinivas Avasarala: ‘స్మోక్’ అనే షార్ట్ ఫిల్మ్ చూస్తే.. కచ్చితంగా ‘పిండం’ చూస్తారు
************************************
*Ester Noronha: ‘మాయ’.. ఇలాంటి స్టోరీలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలి
**********************************
*Venkatesh: హీరోలందరి ఫ్యాన్స్ అభిమానించే సింగిల్ హీరో..
********************************