సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manchu Lakshmi: లాభాపేక్ష లేకుండా.. నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యం

ABN, First Publish Date - 2023-02-20T20:18:36+05:30

‘షాదీ బై మారియట్ బోన్వాయ్’ (SHAADI BY MARRIOTT BONVOY) పేరిట టీచ్ ఫర్ చేంజ్ (Teach For Change) వార్షిక నిధుల సమీకరణ- 2023 కార్యక్రమం తాజాగా వెస్టిన్‌ హోటల్‌లో..

Teach For Change Annual Fundraiser 2023 Event
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘షాదీ బై మారియట్ బోన్వాయ్’ (SHAADI BY MARRIOTT BONVOY) పేరిట టీచ్ ఫర్ చేంజ్ (Teach For Change) వార్షిక నిధుల సమీకరణ- 2023 కార్యక్రమం తాజాగా వెస్టిన్‌ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ (DK Aruna) హాజరయ్యారు. టీచ్ ఫర్ చేంజ్ అనేది నటి లక్ష్మీ మంచు (Manchu Lakshmi) మరియు బ్రహ్మచారి చైతన్య చేత 2014లో స్థాపించబడిన లాభాపేక్ష లేని సంస్థ. భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచడం ఈ సంస్థ లక్ష్యం. ఇప్పటికే మంచి గుర్తింపును పొందిన ఈ సంస్థ.. ప్రతి సంవత్సరం నిధుల సమీకరణ కోసం కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ప్రస్తుతం నిర్వహించిన కార్యక్రమానికి భారీగా సెలబ్రిటీలు హాజరయ్యారు.

ప్రియుడు జాకీ భగ్నానితో కలిసి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), నైనా సెహ్వాల్‌, రెజీనా కసాండ్రా, ఫరియా అబ్దుల్లా, సంధ్య రాజు, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, చాందిని చౌదరి, మానస వర్ణసి, దక్ష నాగర్కర్, అక్షర గౌడ, కోమలీ ప్రసాద్, హనీ రోజ్, ప్రదీప్ మాచిరాజు, అదిత్, వర్ష బొల్లమ్మ, హెబా పటేల్, ప్రగ్యా జైస్వాల్, శుభ్ర అయ్యప్ప, సీరత్ కపూర్, నవదీప్, శివ కందుకూరి వంటి వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాంప్ వాక్ చేశారు.

ఈ సందర్శంగా నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. టీచ్‌ ఫర్‌ చేంజ్‌ అనేది లాభాపేక్ష లేని సంస్థ. 2014లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా కొనసాగుతోంది. అంతేకాదు ఫ్లాగ్‌షిప్‌ వాలంటీర్‌ ప్రొగ్రామ్‌, స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌ల నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు తదితర అంశాల కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తోంది. ప్రస్తుతం 248 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 42 ,080 మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి లబ్దిపొందుతున్నారు. ఈ కార్యక్రమ లక్ష్యం నిధుల సేకరణ కోసమే అన్నారు.

టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ సీఈఓ బ్రహ్మచారి చైతన్య (Brahmachari Chaitanya) మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను పేద, మధ్యతరగతికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు అందించేందుకు మా సంస్థ ఎప్పుడూ కృషి చేస్తుంది. ఈ ఈవెంట్ ద్వారా సేకరించిన నిధులతో.. ట్రస్ట్ కార్యక్రమాలలో సామర్థ్యం పెంపొందించడంతో పాటు స్కేలింగ్ చేయడంలో ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. (The Antora Teach For Change Annual Fundraiser 2023)

Updated Date - 2023-02-20T20:25:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!