కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sumaya: ‘డియర్ ఉమ’‌తో మల్టీ టాలెంట్‌ ప్రదర్శించబోతోన్న అనంతపురం అమ్మాయ్..

ABN, First Publish Date - 2023-12-17T16:22:21+05:30

అనంతపురంకు చెందిన తెలుగమ్మాయి సుమయారెడ్డి మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ .... సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించారు. సుమయ తన తొలి చిత్రం ‘డియర్ ఉమ’‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కోసం ఆమె విభిన్నమైన క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తూ.. తనలో ఉన్న మల్టీ టాలెంట్‌ను పరిచయం చేయబోతోంది.

Heroine Sumaya Reddy

తెలుగు అమ్మాయిలు సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు ఎక్కువగా ఇష్టపడరు అని, ఒకవేళ వచ్చినా వారికి సరిగా అవకాశాలు ఇవ్వరనేలా ఎప్పుడూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో అనంతపురంకు చెందిన తెలుగమ్మాయి సుమయా రెడ్డి (Sumaya Reddy) మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ .... సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించారు. సుమయ తన తొలి చిత్రం ‘డియర్ ఉమ’‌ (Dear Uma)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కోసం ఆమె విభిన్నమైన క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తూ.. తనలో ఉన్న మల్టీ టాలెంట్‌ను పరిచయం చేయబోతోంది.

పృథ్వీ అంబర్‌తో కలిసి నటించిన ‘డియర్ ఉమ’ చిత్రంలో సుమయా రెడ్డి హీరోయిన్‌గా నటించడమే కాకుండా.. రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ (Suma Chitra Arts) బ్యానర్‌పై సాయి రాజేష్ మాధవ్ (Sai Rajesh Madhav) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. వినూత్నంగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.


సుమయా రెడ్డి విషయానికి వస్తే.. ఈ మూవీతో ఆమె తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను అందుకోవాలని చూస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమెకు క్రేజీ ఆఫర్లు వస్తాయని, నిర్మాతగా మంచి కంటెంట్‌తో సినిమాలు నిర్మిస్తానని చెబుతోంది. ఈ భామను చూస్తుంటే.. ముందు ముందు తన అందంతో, నటనతో టాలీవుడ్‌లో పాగా వేసేలానే కనిపిస్తోంది. చూద్దాం.. ఆమె కెరీర్ ఎలా టర్న్ అవుతుందో..


ఇవి కూడా చదవండి:

====================

*Salaar: అభిమానులకు 100 టికెట్స్ ఇస్తానంటోన్న యంగ్ హీరో.. క్రేజ్ అలా ఉంది మరి!

*********************************

*Manchu Manoj: శోభా నాగిరెడ్డి బర్త్ యానివర్సరీ.. గుడ్ న్యూస్ చెప్పిన మంచు మనోజ్

******************************************

*Bhagyashri Borse: షాకిచ్చిన హరీష్ శంకర్.. మాస్ రాజా సరసన క్లాస్ రాణి

*************************************

Updated Date - 2023-12-17T16:22:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!