Bandla Ganesh: కారును పాతాళానికి తొక్కుతూ ‘రేవంత్ సునామీ’.. నేను ఎల్బీ స్టేడియానికి పోతున్నా
ABN, First Publish Date - 2023-12-03T15:01:06+05:30
‘నిన్న రాత్రి కాంగ్రెస్ అభిమానులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా దయచేసి ఈ రాత్రికి ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా కాపలా ఉండండి. ఏ క్షణం ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది, ఎవరిని నమ్మొద్దు ఇది నా విజ్ఞప్తి విన్నపం’ అంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ చేసి చేసిన సంచలనంగా మారగా తాజాగా ఇప్పుడు నేను ఎల్బీ స్టేడియానికి పోతున్నా అంటూ మరో ట్వీట్ చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
నిన్న రాత్రి కాంగ్రెస్ అభిమానులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా దయచేసి ఈ రాత్రికి ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా కాపలా ఉండండి. ఏ క్షణం ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది, ఎవరిని నమ్మొద్దు ఇది నా విజ్ఞప్తి విన్నపం అంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (BANDLA GANESH) చేసిన ట్వీట్ చేసి చేసిన సంచలనంగా మారగా తాజాగా ఇప్పుడు నేను ఎల్బీ స్టేడియానికి పోతున్నా అంటూ మరో ట్వీట్ చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
విషయానికి వస్తే వారం రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ విలేఖరి తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, సీఎం ఎవరవుతారని ప్రశ్న ఆడగగా ఈ సారి కాంగ్రెస్ గెలవడం ఖాయమని, రేవంత్ సీఎం కావడం పక్కా అని డిసెంబర్ 9 నాడు ప్రమాణం స్వీకారం చేస్తాడని నేను 7వ తేదీ రాత్రే ఎల్బీ స్టేడియానికి వెళ్లి అక్కడే ఉంటానని, అక్కడే పడుకుంటానంటూ వ్యాఖ్యలు చేయగా అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
అయితే ఈ రోజు (ఆదివారం) ఎన్నికల కౌంటింగ్ జరిగి కాంగ్రెస్ మెజార్టీ సీట్లను సాధించడంతో బండ్ల గణేశ్(BANDLA GANESH) స్పందిస్తూ నేను చెప్పినట్టుగానే ఎల్బీ స్టేడియంకు వెళ్లడానికి సిద్ధమయ్యానంటూ మరో ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది.
అదేవిధంగా అన్నీతానై వన్ మాన్ షోతో కారును పాతాళానికి తొక్కుతూ రేవంత్ సునామీ వచ్చిందని, జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన సామాన్యుడు అంటూ రేవంత్ అంటూ మరో పోస్టు పెట్టి బండ్ల గణేశ్ (BANDLA GANESH) కొత్త చర్చకు తెర లేపారు. ఇంకా చూడాలి మున్ముందు ఎలాంటి పోస్టులు పెడతారో.