Allu Arjun: 30 ఏళ్ల తర్వాత సడెన్‌గా ఆమెని చూసి షాకైన బన్నీ.. ఆమె ఎవరో తెలుసా?
ABN, First Publish Date - 2023-05-10T20:37:28+05:30
ఆమె ఎప్పుడూ నన్ను తిట్టలేదు. అర్జున్.. జీవితం అంటే చదువు ఒక్కటే కాదు.. జీవితం అనేది ప్రతి ఒక్కరికీ వరం. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నువ్వు కూడా తప్పకుండా ఉన్నత శిఖరాలకు వెళ్తావని అనేవారు. ఇంకా బన్నీ ఆమె గురించి చెబుతూ..
మన గడిచిపోయిన జీవితంలో.. ఉన్న తీపి మెమరీస్‌లో ఏదో ఒకటి.. ఎవరో ఒకరు.. ఒక్కసారిగా కళ్లముందు కదిలితే ఎలా షాక్ అవుతామో.. అలాగే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షాకయ్యారు. 30 ఏళ్ల క్రితం తనకు చదువు చెప్పిన టీచర్‌ని ఒక్కసారిగా స్టేజ్‌పై చూడటంతో.. అల్లు అర్జున్ (Allu Arjun) ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని రెండు చేతులు జోడించి.. వంగి ఆమె కాళ్లకు నమస్కారం చేశారు. ఈ ఘటన రీసెంట్‌గా చెన్నైలో బిహైండ్‌వుడ్స్ (Behindwoods) అవార్డుల వేడుకలో జరిగింది. ‘గోల్డెన్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ (Golden Icon of Indian Cinema)గా అల్లు అర్జున్ ఈ అవార్డుల వేడుకలో అవార్డును సొంతం చేసుకున్నారు. రెహమాన్ చేతుల మీదగా అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకున్నారు. అనంతరం, అల్లు అర్జున్‌ను సర్‌ప్రైజ్ చేసేలా.. 3వ తరగతి చదివే రోజులలో బన్నీకి పాఠాలు చెప్పిన స్కూల్ టీచర్ (School Teacher)ని వేదికపైకి తీసుకువచ్చారు. ఆమెను చూసి.. మరోసారి బన్నీ తన బాల్యంలోకి వెళ్లివచ్చారు.
ముందుగా బన్నీ టీచర్ (Bunny Teacher) మాట్లాడుతూ.. ‘‘నా కొడుకులాంటి వాడి గురించి నేనేం చెప్పేది. మంచి హీరోగా పేరు తెచ్చుకుని.. మా టీచర్లందరికీ గర్వకారణం అయ్యాడు. ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి.. ఎందరెందరో ప్రజల అభిమానానికి పాత్రుడయ్యాడు. మేము తనని ఎప్పుడూ అర్జున్ అని పిలవలేదు.. అల్లూస్ అని పిలిచేవాళ్లం. పుట్టడమే డ్యాన్సింగ్ షూస్‌తో పుట్టాడనిపిస్తుంది. తనని చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఇలాగే ప్రజలను ఇంకా ఆనందపరుస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.
అనంతరం బన్నీ మాట్లాడుతూ.. ‘‘ఈమె పేరు అంబికా కృష్ణన్ (Ambika Krishnan). మూడో తరగతిలో నా జాగ్రఫీ టీచర్. నేను చదువుకునే క్రమంలో ఎంతోమంది టీచర్స్ నాకు పాఠాలు చెప్పారు. కానీ, వారందరీలో ఈ టీచర్‌కే ప్రథమస్థానం ఇస్తాను. క్లాస్‌లో 50 మంది విద్యార్థులు ఉంటే నాదే లాస్ట్ ర్యాంక్. అంత పూర్ స్టూడెంట్‌ని నేను. అయినా కూడా ఆమె ఎప్పుడూ నన్ను తిట్టలేదు. అర్జున్.. జీవితం అంటే చదువు ఒక్కటే కాదు.. జీవితం అనేది ప్రతి ఒక్కరికీ వరం. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నువ్వు కూడా తప్పకుండా ఉన్నత శిఖరాలకు వెళ్తావని అనేవారు. ప్రతి టీచర్ ఇలా ఉండాలని నేను కోరుకుంటాను. ఆమెను ఈరోజు ఇలా చూస్తుంటే నాకెంతో సర్‌ప్రైజింగ్‌గా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తి నింపేలా చిన్న చిన్న కోట్స్ రాయడం అలవాటు. అలా, నేను రాసిన ‘Only Kindness is Remembered Forever’ అనే కోట్‌కు నా ఈ టీచరే స్ఫూర్తి’’ అని తన టీచర్‌కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Allu Arjun about His Teacher)
ఇవి కూడా చదవండి:
************************************************
*Kushboo: పెళ్ళి కోసం నేను మతం మారలేదు.. ‘కేరళ స్టోరీ’ విమర్శలపై ధీటైన సమాధానం
*NBK108: బ్రహ్మాజీకి కోపం వచ్చింది.. అందుకే డైరెక్టర్‌కి నమస్తే పెట్టేశాడు
*Aadi Saikumar: ఆది సినిమా.. ఒకటి కాదు.. రెండు ఓటీటీల్లో..
*Vijayashanthi: ఆ హక్కు ఎవరికుంది?.. ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌పై సంచలన వ్యాఖ్యలు
*Vasuki Anand: పవన్ కల్యాణ్ సోదరి అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది
*VD12: విజయ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రత్యేక పోస్టర్.. ఫ్యాన్స్ ఖుష్
*Kushi: సినిమా పేర్లతో విజయ్ దేవరకొండ, సమంత పాటేసుకున్నారు.. పాట ఎలా ఉందంటే..