సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nandi Awards: నంది అవార్డుల వివాదంపై మంత్రి తలసాని రియాక్షన్ ఇదే..

ABN, First Publish Date - 2023-05-04T16:30:13+05:30

నంది అవార్డులను.. రెండు తెలుగు రాష్ట్రాలు (Telugu States) విడిపోయినప్పటి నుంచి ఇవ్వడం లేదు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈ అవార్డులను పట్టించుకోలేదు. ముఖ్యంగా నంది అవార్డు అంటే ఏపీకి చెందుతుందని, ఇకపై తెలంగాణలో ‘సింహ’ అవార్డులు ఉంటాయని..

Minister Talasani Srinivas Yadav
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొన్ని రోజులుగా నంది అవార్డులపై (Nandi Awards) ఎటువంటి చర్చలు జరుగుతున్నాయో, ఆ చర్చలు ఎలాంటి వివాదాలకు దారితీస్తున్నాయో తెలియంది కాదు. ఈ వివాదాలపై తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) స్పందించారు. నంది అవార్డుల విషయమే తమకి ఎవరూ ఇంత వరకూ ఎటువంటి ప్రతిపాదన చేయలేదని ఆయన తెలిపారు. సినిమా వాళ్లకి ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను.. రెండు తెలుగు రాష్ట్రాలు (Telugu States) విడిపోయినప్పటి నుంచి ఇవ్వడం లేదు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈ అవార్డులను పట్టించుకోలేదు. ముఖ్యంగా నంది అవార్డు అంటే ఏపీకి చెందుతుందని, ఇకపై తెలంగాణలో ‘సింహ’ అవార్డులు (Simha Awards) ఉంటాయని ఒకానొక దశలో తలసాని చెప్పుకొచ్చారు. ‘సింహ’ అవార్డుల ప్రస్తావన ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దగ్గర కూడా ప్రస్తావించినట్లుగా ఆయన తెలిపారు. కానీ.. ఆ తర్వాత ఈ విషయం ముందుకు సాగలేదు.

రీసెంట్‌గా ‘మోసగాళ్లకు మోసగాడు’ (Mosagallaku Mosagadu) రీ రిలీజ్‌కు సంబంధించి జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ అవార్డుల విషయమై నిర్మాత అశ్వనీదత్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్‌కు బదులిస్తూ.. నటుడు పోసాని కృష్ణమురళీ టీడీపీని టార్గెట్‌ చేస్తూ కామెంట్స్ చేశారు. దీంతో మరోసారి సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డుల వివాదం మొదలైంది. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) కూడా ఈ అవార్డుల వివాదంపై కామెంట్స్ చేశారు. ‘‘ఇటీవల అవార్డుల విషయంపై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ (Aswani Dutt), ఏపీ ఎఫ్.డి.సి. చైర్మన్ పోసాని (Posani) మాట్లాడిన మాటలు సమర్థనీయం కావు. టీడీపీ తరపున వకల్తా పుచ్చుకుని అశ్వనీదత్ మాట్లాడితే, ఆ తర్వాతే పోసాని మాట్లాడారు. అయినా సినిమా రంగం విషయంలో పార్టీలకతీతంగా వ్యవహరించాలి. అసలీ అవార్డులను ఇవ్వడం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి మరచిపోయాయి’’ అని నట్టి కుమార్ ఆరోపించారు. ఇలా మొత్తంగా నంది అవార్డుల విషయమై ఇండస్ట్రీలో బాగానే వేడి రాజుకుంది.

ఈ వేడిని చల్లార్చే ప్రయత్నంగా తాజాగా తలసాని ఈ అవార్డుల వివాదంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. (Talasani Reaction) ‘‘నంది అవార్డుల విషయమై.. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి ఎవరూ ప్రతిపాదనలు చేయలేదు. కొందరు మీడియా కనిపించగానే అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. తెలుగు సినిమా పరిశ్రమ (Tollywood)కు మా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. వచ్చే ఏడాది నుంచి సినిమా వారికి అవార్డులు ఇచ్చే ఆలోచన చేస్తాం’’ అని తలసాని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Naga Chaitanya: చైతూ చెప్పింది.. ‘ఏజెంట్’ రిజల్ట్ గురించేనా?

*Vijay Antony: నా ప్రాణాలను నా హీరోయిన్‌ కాపాడింది

*Dimple Hayathi: గుడి కట్టాలనుకుంటున్న అభిమానికి షాకిచ్చిన హయాతి

*Chaitu Vs Sam: చైతూ ఏమో బాధలేదంటాడు.. సమంత ఏమో టార్చర్ టైమ్ అంటోంది.. ఏంటి కథ?

*Hero Shanthanu Bhagyaraj: ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

Updated Date - 2023-05-04T16:30:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!