NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!
ABN, First Publish Date - 2023-04-06T14:30:39+05:30
నందమూరి నటసింహం అనగానే.. లెంగ్తీ డైలాగ్స్, మాసీ డైలాగ్సే గుర్తొస్తాయి. ఆ డైలాగ్స్ చెప్పడంలో ఆయనని మించిన వారు లేరు. అలాంటిది బాలయ్య నటించిన సినిమాలలోని పవర్‌ఫుల్ డైలాగ్స్‌ని ఐపీఎల్ (IPL 2023)లో..
‘సెంటర్ అయినా.. స్టేట్ అయినా.. నేను దిగనంత వరకే’.. అనే బాలయ్య (Balakrishna), ఈ మధ్య అన్నింటిలోకి దిగేస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు, టాక్ షోలు.. ఇలా ఇప్పుడాయన కామెంటేటర్‌గా కూడా అవతారమెత్తారు. స్టార్ స్పోర్ట్స్ (Star Sports) కామెంట్రీ బృందంతో జతకట్టిన బాలయ్య, తనదైన కామెంట్రీతో అందరినీ అలరిస్తున్నారు. బాలయ్య సినిమాలలో చెప్పే డైలాగ్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో తెలియంది కాదు. ఇప్పుడు బాలయ్య అడుగుపెట్టడంతో.. క్రికెట్ కామెంట్రీ కూడా మారిపోయింది. అందులో కూడా తన మార్క్‌ను ఈ నటసింహం (Natasimha) ప్రదర్శిస్తున్నారు. నందమూరి నటసింహం అనగానే.. లెంగ్తీ డైలాగ్స్, మాసీ డైలాగ్సే గుర్తొస్తాయి. ఆ డైలాగ్స్ చెప్పడంలో ఆయనని మించిన వారు లేరు. అలాంటిది బాలయ్య నటించిన సినిమాలలోని పవర్‌ఫుల్ డైలాగ్స్‌ని ఐపీఎల్ (IPL 2023)లోని సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) టీమ్‌కి చెందిన క్రికెటర్స్ చెబితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందీ ఏంటి.. దబిడే దిబిడే.
నిజమే.. ఆ విషయం ఈ వీడియో చూసిన ఎవరైనా అనుకోవాల్సిందే. దబిడే దిబిడే డైలాగ్.. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి నోటా పలకాల్సిందే. ఎందుకంటే.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక.. నోరు తిరగక SRH క్రికెటర్లు (SRH Cricketers) అన్ని తిప్పలు పడ్డారు మరి. వారిని చూసిన వారంతా.. పాపం అని అనుకుని తీరాల్సిందే. మరీ ముఖ్యంగా ఈ ఐపీఎల్‌లో రూ. 13 కోట్ల భారీ ధర పలికిన బ్రూక్ (Harry Brook).. బాలయ్య డైలాగ్ చెప్పడానికి పడిన అవస్థ చూసి నవ్వకుండా ఉండలేరు. డైలాగ్ చెప్పలేక బ్రూక్.. ‘ఓ మై గాడ్’ అనేశాడు. తర్వాత ఎలాగోలా డైలాగ్ చెప్పాడు. బ్రూక్ మాత్రమే కాకుండా.. SRH ప్రస్తుత కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar), హెడ్ కోచ్ బ్రియన్ లారా (Brian Lara) కూడా బాలయ్య సినిమాలలోని డైలాగ్స్‌ని పలికారు. బాలయ్య డైలాగ్స్ చెప్పడానికి వారు ఎంత కష్టపడ్డారంటే.. తలలు కూడా పట్టేసుకున్నారు. SRH క్రికెటర్లు బాలయ్య సినిమా డైలాగ్స్ చెబుతున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇందులో భువనేశ్వర్ కుమార్.. ‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ అనే డైలాగ్ చెబితే.. బ్రూక్, లారా ఇద్దరూ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ అనే డైలాగ్ చెప్పారు. SRH బౌలర్ ఉమ్రన్ మాలిక్ (Umran Malik) ‘దబిడి దిబిడే’ డైలాగ్‌ను కూడా చెప్పలేకపోయాడు. ఓ నాలుగైదు అటెంఫ్ట్స్ తర్వాత సరిగా చెప్పాడు. ఇలా SRH టీమ్ క్రికెటర్లు ఇబ్బంది పడితే.. నెటిజన్లు మాత్రం యమా ఖుష్ అయ్యారు. నందమూరి అభిమానులు (Nandamuri Fans) కొందరు ‘జై బాలయ్య’ (Jai Balayya) అని కామెంట్ చేస్తే.. మరికొందరు, ఈ డైలాగ్స్ కాదు.. ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ డైలాగ్ చెప్పించాల్సిందనేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం.. ‘ఈ డైలాగ్స్ కాదు.. ముందు సరిగా ఆడి గెలవండి’ అంటూ హితబోధ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ‘లెజెండ్ (Legend) బాలయ్య డైలాగ్స్ మన హైదరాబాద్ ప్లేయర్స్ నోట..!’ అంటూ.. స్టార్ స్పోర్ట్స్ తెలుగు వారు చేసిన ఈ ట్వీట్ భారీ స్పందనను రాబట్టుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
*********************************
*Dasara Nani: అందరికీ చెప్పేది ఒకటే.. చాలా మంది చాలా చెప్తారు.. ఎవ్వరి మాటలు వినకండి
*Ustaad Bhagat Singh: ఫ్రంట్ ఏంటి? బ్యాక్ ఏంటి?.. కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలదా..
*Hanuman Jayanti Special: ‘ఆదిపురుష్’ నుంచి హనుమాన్ పోస్టర్.. ఎలా ఉందంటే?
*Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!
*Niharika: పచ్చి మామిడికాయ తింటూ నిహారిక పోస్ట్.. అంతా షాక్!