Kalyani: దర్శకుడు సూర్యకిరణ్‌తో కళ్యాణి విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా?
ABN, First Publish Date - 2023-08-01T22:55:53+05:30
‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘వసంతం’ వంటి చిత్రాలలో నటించి తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నటిగా కళ్యాణి మంచి పేరును సొంతం చేసుకుంది. కెరీర్ మంచి స్టేజ్‌లో ఉండగానే.. సుమంత్‌తో ‘సత్యం’ వంటి సక్సెస్‌పుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సూర్య కిరణ్‌ను వివాహం చేసుకుంది. అయితే వారిద్దరూ ఇటీవల విడిపోయారు. అందుకు కారణం ఆర్థిక ఇబ్బందులే అని సూర్య కిరణ్ సోదరి సుజిత తన తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.
‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘వసంతం’ వంటి చిత్రాలలో నటించి తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నటిగా కళ్యాణి మంచి పేరును సొంతం చేసుకుంది. కెరీర్ మంచి స్టేజ్‌లో ఉండగానే.. సుమంత్‌తో ‘సత్యం’ (Satyam) వంటి సక్సెస్‌పుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సూర్య కిరణ్‌ను వివాహం చేసుకుంది. కళ్యాణి (Kalyani), సూర్య కిరణ్ (Surya Kiran) ఇద్దరూ అన్యోన్య దంపతులుగా ఆ మధ్య పేరు పొందారు. ఇండస్ట్రీలో జరిగిన పలు ఈవెంట్స్‌కు సైతం ఇద్దరూ కలిసి హాజరై.. ఎప్పుడూ నిండుగా కనిపించేవారు. కానీ సడెన్‌గా వారిద్దరి మధ్య ఏం జరిగిందో.. విడాకులు తీసేసుకున్నారు. దీంతో అసలు వారిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందనేలా అంతా సెర్చ్ చేస్తున్న క్రమంలో.. వారి విడాకులకు కారణం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కారణమని తెలియవచ్చింది. (Sujitha about Surya Kiran and Kalyani Divorce)
సూర్య కిరణ్ చెల్లెలు, నటి సుజీత (మెగాస్టార్ చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ చిత్రంలో పసివాడిగా నటించిన పాప).. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అన్న సూర్య కిరణ్, వదిన కళ్యాణి విడిపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. వారిద్దరూ విడిపోవడానికి మెయిన్ కారణం ఆర్థిక సమస్యలే అని తెలిపింది. అవే వారిద్దరినీ విడదీయడానికి కారణమయ్యాయని ఆమె చెప్పిన సమాధానం విని అంతా ఆశ్చర్యపోయారు. ఎంత ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ.. చాలా మంది కలిసే ఉంటున్నారు. అందులోనూ సెలబ్రిటీ కపుల్ అయిన వీరిద్దరూ విడిపోవడం ఏమిటి? అని అంతా అనుకుంటున్నారు.
దర్శకుడిగా ‘సత్యం’ సినిమాతో మంచి పేరు గడించిన సూర్య కిరణ్.. ఆ తర్వాత చేసిన చిత్రాలతో సరైన గుర్తింపును పొందలేకపోయారు. సరైన సక్సెస్ లేకపోవడంతో అది ఆయన కెరీర్‌పై పడింది. దీంతో ఆయన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కళ్యాణి తన వరకు వచ్చిన చిన్న చిన్న పాత్రలలో నటించినా.. కుటుంబాన్ని నిలబెట్టేంతగా ఆమె సంపాదన లేకపోయింది. దీంతో విడాకులే శరణ్యం అనుకున్న ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం కళ్యాణి.. దర్శకురాలిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఆమె డైరెక్ట్ చేయనున్న చిత్ర వివరాలు బయటకు రానున్నాయి.
ఇవి కూడా చదవండి:
**************************************
*VD13: సెట్స్‌లో మృణాల్‌ని సర్‌ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ
**************************************
*Pawan Kalyan: సినీ పరిశ్రమ తలెత్తుకునేలా చేస్తారని ఆశిస్తున్నా..
**************************************
*Tiger Nageswara Rao: ఆ రూమర్స్‌కు బ్రేక్ వేస్తూ.. మరోసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ
**************************************
*Mrunal Thakur: బర్త్‌డే స్పెషల్‌గా ‘హాయ్ నాన్న’ టీమ్ ఇచ్చిన ట్రీట్ ఇదే..
**************************************