సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha: చాలా గ్యాప్ తర్వాత ‘అక్కినేని’ పేరు ప్రస్తావించిన సమంత.. ఎందుకో తెలుసా?

ABN, First Publish Date - 2023-04-08T14:40:48+05:30

ఇక విడాకుల తర్వాత అక్కినేని (Akkineni) అనే పేరు కూడా తలుచుకోని సమంత.. తాజాగా ఆ పేరుతో ఓ పోస్ట్‌నే చేసింది. నిజంగా ఇది అందరికీ షాక్ ఇచ్చే విషయమే. ఎందుకు మళ్లీ..

Samantha and Akkineni Family Heroes
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోయిన్‌గా పాన్ ఇండియా (Pan India Heroine) స్థాయిలో పేరొందిన సమంత (Samantha).. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం తేరుకోలేని పరాభవానికి గురైంది. ముఖ్యంగా ఎంతగానో ప్రేమించి, పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)తో విడాకులు తీసుకోవడం.. సమంతకు చెరగని మచ్చగా వెంటాడుతూనే ఉంటుంది. వారిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ.. ఏదో ఒక విషయంలో సమంతపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అలా ట్రోల్ చేసే వారికి సమంత కౌంటర్స్ ఇస్తూనే ఉంటుంది. అయితే సమంత, నాగచైతన్య విడిపోవడానికి గల కారణాలైతే ఇంత వరకు తెలియరాలేదు కానీ.. చైతూ బిహేవియర్‌పై అనుమానాలు వచ్చేలా సమంత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేసింది. అంతే, అంతకు మించి వారి మధ్య ఏం జరిగింది? అనేది మాత్రం ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు.

Also Read-Allu Arjun Birthday Special: గ్లోబల్ స్థాయికి దూసుకెళుతోన్న రేసుగుర్రం

ఇక విడాకుల తర్వాత అక్కినేని (Akkineni) అనే పేరు కూడా తలుచుకోని సమంత.. తాజాగా ఆ పేరుతో ఓ పోస్ట్‌నే చేసింది. నిజంగా ఇది అందరికీ షాక్ ఇచ్చే విషయమే. కానీ ఆమె ఎందుకు మళ్లీ.. ‘అక్కినేని’ పేరు ప్రస్తావించింది అనేది తెలిస్తే మాత్రం.. సమంత కోపం చైతూ మీద మాత్రమేకానీ.. ‘అక్కినేని’ మీద, ఇంకా ఆ కుటుంబ సభ్యుల (Akkineni Family) మీద కానే కాదని అర్థమవుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏజెంట్’ (Agent). పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అఖిల్ కెరీర్‌కి ఎంతో ముఖ్యం. ఏప్రిల్ 8 అఖిల్ పుట్టినరోజు (HBDAkhilAkkineni) సందర్భంగా.. గ్రీటింగ్స్ తెలుపుతూ చిత్రయూనిట్ ఓ ప్రత్యేక పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన సమంత.. అఖిల్ అక్కినేని‌కి స్పెషల్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు (#HappyBirthdayAkhil) తెలిపింది.

చైతూతో విడాకులకు ముందు కూడా అఖిల్ విషయంలో సమంత ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా ఉండేది. తన అన్నతో విడాకులు తీసుకున్నప్పటికీ.. అఖిల్ కూడా సమంత విషయంలో పాజిటివ్‌గానే ఉంటాడు. ఈ నేపథ్యంలో సమంత తన ఇన్‌స్టా వేదికగా.. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్ అక్కినేని (HappyBirthdayAkhil). ఏప్రిల్ 28న రాబోతున్న నీ ‘ఏజెంట్’ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రేమతో..’ అంటూ రెండు చేతులతో జోడించి ఉన్న ఓ లవ్ సింబల్‌ని సమంత పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఇంకా అఖిల్‌ను సమంత మరిదిగానే భావిస్తుందని.. అందుకే ఇలా ప్రేమగా శుభాకాంక్షలు తెలిపిందనేలా కామెంట్స్ చేస్తున్నారు. సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*HappyBirthdayAlluArjun: బన్నీది ఎంత మంచి మనసంటే.. అంతమందిని చూసి లైట్ తీస్కోవడానికి మనసు రాక..

*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్

*Shruti Haasan: అందుకే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో చేశా..

*Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

Updated Date - 2023-04-08T14:40:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!